అవకాశం దొరికితే.. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు నారా లోకేష్‌పై సెటైర్లు వేయానికి సిద్ధంగా ఉంటారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు మరోసారి నారా లోకేష్‌ను టార్గెట్ చేసిన ఆయన.. తాజాగా, లోకేష్ తీస్తున్న ఓ సెల్ఫీకి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పంచ్‌లు వేశారు.. ”ఇదేంటి బోకేష్! అక్కడ ఫోన్ ను తలకిందులు చేయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ అంత ఎత్తులో పెడితే ఆ బుడ్డోడు ఫ్రేమ్ లోకి ఎలా వస్తాడు? దాని బదులు నువ్వే తలకిందులుగా… తల కిందకు పెట్టి, కాళ్ళు పైకెత్తి సెల్ఫీ తీసుకుంటే అందరూ పడతారు కదా! అందుకే కదా నిన్ను పప్పు అంది! అటూ #RIPStanford యాష్ ట్యాగ్ జోడించాడు..
Read Also: Bengaluru Crime: ప్రియురాలితో శృంగారం చేస్తూ వ్యాపారవేత్త మృతి..
మరోవైపు.. విజయసాయిరెడ్డి ఫోన్ వ్యవహారంలో వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు సాయిరెడ్డి.. బోండం! బాబు సిఎంగా ఉన్నప్పుడే నీ ఇద్దరు కొడుకులు, భార్య మీద క్రిమినల్ కేసులు పెట్టించి కుక్కలా కాళ్ల కింద పడి ఉండాలని గొలుసుతో కట్టేశాడు. అయినా నీకు సిగ్గు రాలేదు. ఫోన్ పోతే వంద కథలు అల్లడం ఏంట్రా!దివాళాకోరుతనం కాకపోతే. అంటూ ఫైర్ అయ్యారు.. ఒరేయ్ బొండాం! ఏదైనా పంచాల్సి వచ్చినప్పుడు తన వాళ్లను మాత్రమే ఎంపిక చేస్తాడు బొల్లి బాబు. ఎవరి కళ్లల్లో అయినా కారంపొడి కొట్టాలంటే బోండాంలాంటి రౌడీలను సెలెక్ట్ చేస్తాడు. జేబుదొంగ శిష్యుడు సైకిల్ బెల్లుల దొంగ. స్క్రిప్టు అందితే గుడ్డిగా చదివేస్తాడు. నమ్మశక్యంగా ఉందో లేదో చూడడు. అంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
ఇదేంటి బోకేష్! అక్కడ ఫోన్ ను తలకిందులు చేయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ అంత ఎత్తులో పెడితే ఆ బుడ్డోడు ఫ్రేమ్ లోకి ఎలా వస్తాడు? దాని బదులు నువ్వే తలకిందులుగా…తల కిందకు పెట్టి, కాళ్ళు పైకెత్తి సెల్ఫీ తీసుకుంటే అందరూ పడతారు కదా! అందుకే కదా నిన్ను పప్పు అంది!#RIPStanford pic.twitter.com/8DS1LTXjZN
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2022