కాంగ్రెస్‌కు మరోసారి శక్తిని నింపేలా రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో పార్టీ చింతన్ శిబిర్ మేధోమథనం చాలా అంశాలను టచ్ చేసింది. అందులో చర్చకు వచ్చిన వాటిల్లో హాట్ టాపిక్‌గా మారింది మాత్రం.. పార్టీ నాయకుల కుటుంబంలో ఒకరికే టికెట్. దీనిపై పార్టీ చీఫ్ సోనియాగాంధీనే నిర్ణయం ప్రకటించారు. మేడమ్ ఆ మాట చెప్పినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లకు గుబులు పట్టుకుందట. వచ్చే ఎన్నికల్లో తాము పోటీచేయడంతోపాటు మరోచోటు నుంచి వారసులను లేదా కుటుంబ సభ్యులను బరిలో…