తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నికలు వస్తుండగా… తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి దూకుడు పెంచింది… అధికార పార్టీ కంటే ముందే.. తమ అభ్యర్థిని ప్రకటించింది.. ఇప్పటికే పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు కమిటీలు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తోంది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… మునుగోడు ప్రచార బాధ్యతలు మధు యాష్కీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, జీవన్…
భూ నిర్వాసితుల కోసం త్వరలో 72 గంటల దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రైతులతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని బండరావిరాల, చిన్నరావిరాల సర్వే నెం.268లో భూమిని కోల్పోయిన రైతులు తమకు నష్టపరిహారం ఇవ్వాలని కొన్ని నెలలుగా చేస్తున్న పోరాటానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు.. గతంలో భూనిర్వాసితులకు మద్దతుగా…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్‌తో పాటు.. మునుగోడు ఉప ఎన్నికలు.. చండూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ పెద్ద రచ్చగా మారిపోయింది.. తాజా పరిణామాలపై శుక్రవారం ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ వీడినందుకు తనను టార్గెట్ చేసి అవమానాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎన్నో ఏళ్లుగా…
నన్ను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా.. ఇక్కడే చస్తా అని ప్రకటించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఉపఎన్నిక కసరత్తు మీటింగ్‌కు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదన్నారు.. ఏ మీటింగ్ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. నాకు ఆహ్వానం లేని మీటింగ్‌కు నేను ఎందుకు వెళ్తా? అని ప్రశ్నించారు. ఇక, చండూరులో సభలో నన్ను అసభ్యంగా తిట్టించారు. హోంగార్డుతో పోల్చారు.…
మునుగోడు ఉప ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీచేసేందుకు సిద్ధం అవుతుండగా.. మరోవైపు విజయం మాదేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ, ఆ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు తనకు ఆహ్వానం లేదంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరంగా ఉండడంపై పెద్ద చర్చే జరిగింది. అయితే, మునుగోడు ఉప ఎన్నికలపై రేవంత్‌రెడ్డి అప్పుడే చేతులు ఎత్తేశారని…
మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కావడానికి సిద్ధం అయ్యారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వరదల వల్ల తెలంగాణలో జరిగిన నష్టంపై అమిత్ షాను కలుస్తారని చెబుతున్నారు.
Shabbir Ali comments on Komatireddy Rajgopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయం అయింది. అయితే కాంగ్రెస్ పార్టీ వీడిన రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ కోమటిరెడ్డి వ్యవహారంలో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నాయకులు ఒకరికి ఒకరు వార్నింగులు ఇచ్చుకుంటున్నారు.
టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే.. ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేదని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవ చేసారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెళ్ళాంల గ్రామంలో ఎంపీ నిధుల నుండి 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన, ఫిల్టర్ వాటర్ ప్లాంటులను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టు పూర్తి చేస్తే వెంకట్ రెడ్డికి పేరు వస్తోందని సీఎం కేసీఆర్ కక్ష కట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయడం లేదని…