JP Nadda: భారతదేశంలో జరిగిన ఐటీ రైడ్స్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా డబ్బులు బయటపడుతున్నాయి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మద్యం వ్యాపారంలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన జార్ఖండ్ ఎంపీ ధీరజ్ సాహూ నివాసాల్లో బుధవారం నుంచి ఐటీ శాఖ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. 290 కోట్ల నగదు బయటపడింది. ప్రస్తుతం ఇది దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Congress: కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆయన నివాసాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడిండి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో బుధవారం నుంచి ఐటీ అధికారులు సాహు టార్గెట్‌గా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా కోట్లకు కోట్ల నగదు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ధీరజ్ సాహు ఈ కేసులో ప్రధానంగా ఉన్నారు.
IT Raids: శుక్రవారం ఒడిశాలో కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన పలు ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడులు నిర్వహించింది. ఎంపీకి చెందిన పలు ప్రాంతాల్లో ఏకంగా రూ. 100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్ లో సాహుకు చెందిన నివాసాలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ధీరజ్ సాహు కుటుంబం పెద్ద ఎత్తున మద్యం తయారీ వ్యాపారంలో పాల్గొంటోంది. అతనికి ఒడిశాలో అనేక మద్యం…