YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు.. అవినాష్‌రెడ్డిపై బుధవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.. అవినాష్‌రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా అరెస్ట్ చేయవద్దని పేర్కొంది.. అయితే, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై బుధవారం రోజు హైకోర్టు తీర్పు వెలువరించనుంది..
Read Also: Chief ministers: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. దేశ అంశాలపై మాట్లాడే అవకాశం
కాగా, అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు వాడీవేడీగా సాగాయి.. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించిన సీబీఐ తరపున న్యాయవాది.. అవినాష్‌రెడ్డి సీబీఐకి విచారణకు సహకరించడంలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా అవినాష్‌రెడ్డి ఏదో సాకు చూపి తప్పించుకున్నాడని తెలిపారు.. ఇక, వైఎస్ వివేకా హత్యకు నెలరోజుల ముందే కుట్ర జరిగిందన్న సీబీఐ లాయర్.. వివేకా హత్య వెనుక రాజకీయ కారణం ఉందని వాదించారు.. అయితే, లోకసభ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌రెడ్డిని అనధికారికంగా ముందే ప్రకటించారని స్టేట్‌మెంట్ చెబుతుంది కదా? అని సీబీఐ లాయర్‌ను ప్రశ్నించింది హైకోర్టు.. అవినాష్ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించినట్టు స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా? అన్న కోర్టు.. రాజకీయంగా అవినాష్‌రెడ్డి బలవంతుడు అని మీరే అంటున్నారు.. అలా అయితే వివేకాను చంపాల్సిన అవసరం ఏముందని సీబీఐని ప్రశ్నించింది.. మరోవైపు.. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు?.. వాళ్ల నుండి ఏమైనా సమాచారం రాబట్టారా? అని కూడా సీబీఐని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు.. అయితే, వాళ్లు విచారణకు సహకరించలేదని కోర్టుకు విన్నవించింది సీబీఐ..
Read Also: Minister Jogi Ramesh: మహానాడుపై మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు
మరోవైపు.. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు.. తెల్లవారు జామున అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివిటీపై సీబీఐ నెలవనెత్తిన అంశాలపై స్పందించిన హైకోర్టు.. అవినాష్‌రెడ్డి ఆ సమయంలో ఎవరితో చర్చించారు? అని ప్రశ్నించింది.. అయితే, వాట్సాప్ కాల్ మాట్లాడినట్టు మాత్రమే తెలుస్తుంది.. కానీ, ఎవరితో మాట్లాడారో ఇంటర్నెట్ ద్వారా గుర్తించలేం అని.. ఎవరితో మాట్లాడారో తెలుసుకునేందుకే అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలంటున్నరామని సీబీఐకి తెలిపింది.. మరి అవినాష్ వాట్సాప్‌లో ఉన్న సమయంలో గంగిరెడ్డి వాట్సాప్ కూడా బిజీ ఉందా? అని హైకోర్టు మరో ప్రశ్న వేసింది.. ఈనెల 12వ తేదీనే అవినాష్ రెడ్డి ఐపీడీఆర్ డేటానే సేకరించామన సీబీఐ సమాధానం ఇవ్వగా.. భారీ కుట్రలో అవినాష్ ప్రమేయం ఉన్నట్లు సీబీఐ ఎప్పటి నుంచో అనుమానిస్తోంది కదా? అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారా? కీలక అంశాలపై ఇంత నత్త నడక దర్యాప్తు ఏమిటి?.. మరి దీనిపై ఎందుకు దృష్టి పెట్టలేదు అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.. ఇక, ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. అవినాష్‌రెడ్డిపై బుధవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.