Supreme Court: థియేటర్లలోకి బయటి ఫుడ్ తీసుకెళ్లే విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులు థియేటర్లకు బయటి ఫుడ్ తీసుకురావడంపై యాజమాన్యాలు ఆంక్షలు పెట్టడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. థియేటర్లు ప్రైవేట్ ప్రాపర్టీ కావడం పట్ల యాజమాన్యం నిబంధనలు పెట్టుకోవచ్చని కోర్టు సూచించింది. శిశువుల కోసం తల్లిదండ్రులు తీసుకెళ్లే ఆహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.…
Tribute To Krishna: సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మహేష్‌బాబు ఫ్యామిలీలో ఈ ఏడాది వరుసగా ఇది మూడో విషాదం కావడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. జనవరిలో సోదరుడు రమేష్‌బాబు మరణం, ఆగస్టులో తల్లి ఇందిరాదేవి మరణం, నవంబరులో తండ్రి మరణం మహేష్‌బాబును మానసికంగా కుంగదీశాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు కృష్ణ మృతి పట్ల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. కృష్ణ మృతికి సంతాపంగా…
కరోనా కల్లోలం కారణంగా ప్యాండమిక్ లో జనం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు అడిక్ట్ అయ్యారు. థియేటర్లు తెరచిన తరువాత కూడా పోలోమని సినిమాలకు వెళ్ళడం లేదు. రెండు, మూడు వారాలు ఆగితే ఎటూ బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయిన సినిమా ఓటీటీల్లోనూ వస్తుంది కదా అని ఉదాసీనత జనంలో ఏర్పడింది. అయితే పాపులర్ స్టార్స్ సినిమాలను థియేటర్లలోనే చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మౌత్ టాక్ తో ఆకట్టుకున్న చిన్న సినిమాలనూ ఆదరిస్తున్నారు. కానీ, వస్తోన్న…
ఏపీ సీఎం జగన్‌కు టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ లేఖ రాశారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఏపీ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని… అందులో భాగంగా థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించిందని నట్టి కుమార్ లేఖలో తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అయినా పండగ సీజన్‌లో సినిమాలకు ఎక్కువ కలెక్షన్‌లు ఉంటాయి కాబట్టి 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్మాతలు, సినిమా థియేటర్ల యజమానులు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. అందువల్ల…
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో తమిళనాడు ప్రభుత్వం సోమవారం నుండి ధియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తూ శనివారం జీవోను జారీ చేసింది. అయితే ఏపీలో మాదిరిగా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే సినిమాను ప్రదర్శించాల్సి ఉంటుంది. దాంతో రోజుకు కేవలం మూడు ఆటలతో సరిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తమిళనాడుకు చెందిన సినిమా జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో చాలా రంగాలకు కరోనా నిబంధనల నుండి…
కరోనా మహమ్మారి విజృంభణతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి… ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణలో వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి… ఇదే, సమయంలో.. సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. అయితే, మల్టీప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో మాత్రం యాథావిధిగా నో పార్కింగ్ ఫీజు విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో…