‘పెళ్ళయింది… ప్రేమవిందుకు వేళయింది…’అంటూ కొత్త జంట రణబీర్ కపూర్- అలియా భట్ పాడుకుంటున్నారు. వారి ప్రేమవిందుకోసం రణబీర్ తండ్రి రిషికపూర్ గతంలో నిర్మించిన బంగ్లాను ముస్తాబు చేస్తున్నారు. ఈ బంగ్లాను రిషికపూర్ తన తండ్రి రాజ్ కపూర్, తల్లి కృష్ణ కపూర్ పేర్ల మీద ‘కృష్ణ-రాజ్’పేరుతో నిర్మించారు. రణబీర్, అలియా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న సమయం నుంచీ ‘కృష్ణ-రాజ్’ బంగళాను అధునాతనంగా మార్చడానికి రణబీర్ తల్లి నీతూ కపూర్ ఆదేశించారు. దాదాపు సంవత్సరం నుంచీ ఆ బంగ్లాను కోరిన…