విడుదల: నవంబర్ 19,2021నటీనటులు: అభినవ్ సర్ధార్, రామ్ కార్తీక్, చాందిని తమిళరసన్, షెర్రీ అగర్వాల్దర్శకుడు: వెంకటేష్ త్రిపర్ణనిర్మాతలు: అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణసంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: జె. ప్రభాకర రెడ్డిఎడిటింగ్: పైడి బస్వా రెడ్డి ఓటీటీ ట్రెండ్ మొదలైన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో కొన్ని థియేట్రికల్ రిలీజ్ కూడా అవుతున్నాయి. అలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమై థియేటర్లలోకి వచ్చిన సినిమానే ‘రామ్ అసుర్’. కొత్తవారితో రూపొందిన ఈ సినిమాకు ఎలాంటి…
షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరిస్ లతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష నర్రా హీరోగా పరిచయమైన సినిమా ‘మిస్సింగ్’. ఇదే సినిమాతో శ్రీని జోస్యుల సైతం దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరి రావు సంయుక్తంగా నిర్మించిన ‘మిస్సింగ్’ మూవీ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే గౌతమ్ (హర్ష నర్రా), శ్రుతి (నికీషా రంగ్వాలా)ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. తొలుత శ్రుతి ఫ్యామిలీ మెంబర్స్ ఈ పెళ్ళికి…
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘రాజా విక్రమార్క’. అదే టైటిల్ ను యంగ్ హీరో కార్తికేయ తన తాజా చిత్రానికి పెట్టుకున్నాడు. విశేషం ఏమంటే కెరీర్ ప్రారంభం నుండి కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్న కార్తికేయ ఈ మూవీతోనూ నయా డైరెక్టర్ శ్రీ సరిపల్లిని ఇంట్రడ్యూస్ చేశాడు. మరి ఎన్.ఐ.ఎ. ఏజెంట్ గా కార్తికేయ నటించిన ‘రాజా విక్రమార్క’ ఎలా ఉందో తెలుసుకుందాం. విక్రమ్ (కార్తికేయ) ఎన్.ఐ.ఎ. ఏజెంట్. ఓ కేసులో పొరపాటు చేసి సస్పెండ్ అవుతాడు.…
నాగశౌర్య, రీతూవర్మ తొలిసారి జంటగా నటించిన సినిమా ‘వరుడు కావలెను’. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ కు ముందు వచ్చిన నాగశౌర్య ‘అశ్వద్థామ’ చిత్రం కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయాన్ని పొందలేకపోయింది. అదే యేడాది రీతూవర్మ హీరోయిన్ గా నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ మూవీకి హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లపై కరోనా దెబ్బ పడింది. ఈ యేడాది రీతూవర్మ నటించిన ‘నిన్నిలా – నిన్నిలా’, ‘టక్ జగదీశ్’ చిత్రాలు ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి.…
1996లో వచ్చిన సక్సెస్ ఫుల్ మూవీ ‘పెళ్ళిసందడి’. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆ సినిమా అప్పట్లో పెద్ద మ్యూజికల్ హిట్. పాతికేళ్ళ తర్వాత అదే పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంది ‘పెళ్ళి సందD’. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో కాగా కన్నడ భామ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ‘పెళ్ళి సందD’ శుక్రవారం దసరా కానుకగా విడుదలైంది. వశిష్ట (రోషన్…
‘రెమో, సీమరాజా, శక్తి’ వంటి చిత్రాలతో తమిళ హీరో శివ కార్తికేయన్ తెలుగువారికి చేరువయ్యాడు. అతనితో నెల్సన్ రూపొందించిన ‘వరుణ్ డాక్టర్’ మూవీ తమిళ, తెలుగు భాషల్లో శనివారం జనం ముందుకు వచ్చింది. నాని ‘గ్యాంగ్ లీడర్’, శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రాలలో నటించిన ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్. వరుణ్ (శివ కార్తికేయన్) ఆర్మీ డాక్టర్. అతనికి పద్మిని (ప్రియాంక అరుల్ మోహన్)తో నిశ్చితార్థం జరుగుతుంది. అయితే ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్ గా ఉండే వరుణ్…
నటీ నటులు: శ్వేతా పరాశర్, ప్రవీణ్ యండమూరి, యష్ పూరి, తన్వి ఆకాంక్ష, రవివర్మ, అజయ్మ్యూజిక్: సంతు ఓమ్ కార్,సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయికుమార్నిర్మాతలు: సుప్రీత్ కృష్ణ, లొక్కు శ్రీవరుణ్, రాహుల్ రెడ్డిదర్శకత్వం: సుప్రీత్.సి.కృష్ణస్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం: జీ 5 జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి సినిమా బిజినెస్ లో పండిపోయిన రాఘవేంద్రరెడ్డి తొలిసారి నిర్మాతగా మారి తీసిన సినిమా ‘అలాంటి సిత్రాలు’. కొత్తవారితో తీసిన ఈ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. రాగ్, పల్లవి, దిలీప్, యశ్…
గత కొంతకాలంగా మంచి కమర్షియల్ హిట్ కోసం గోపీచంద్ ఎదురు చూస్తున్నాడు. అలానే ‘గౌతమ్ నంద’ తర్వాత మంచి సక్సెస్ ఫుల్ మూవీ కోసం డైరెక్టర్ సంపత్ నంది ప్రయత్నిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సెకండ్ మూవీగా తెరకెక్కింది ‘సీటీమార్’. గతంలో పూరి దర్శకత్వంలో ‘గోలీమార్’లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన గోపీచంద్ ఇప్పుడీ ‘సీటీమార్’లో కబడ్డి కోచ్ గా నటించాడు. బేసికల్ గా కబడ్డీ ఆటగాడైన కార్తీక్ (గోపీచంద్) ఆంధ్రా బ్యాంక్ లో ఉద్యోగి. సాయంత్రమైతే…
‘హృదయ కాలేయం’తో తెలుగువారి ముందుకు బర్నింగ్ స్టార్ గా వచ్చాడు సంపూర్ణేశ్ బాబు. ఆ తర్వాత ‘కొబ్బరి మట్ట’లో ఏకంగా మూడు పాత్రలు పోషించి మెప్పించాడు. అయితే ఈ రెండు సినిమాలు స్పూఫ్ కామెడీతో తెరకెక్కాయి. ఆ తర్వాత ఆ తరహా చిత్రాలు కొన్ని చేసినా ఇప్పుడు మాత్రం సీరియస్ యాక్షన్ మూవీగా ‘బజార్ రౌడీ’తో శుక్రవారం జనం ముందుకు వచ్చాడు. మరి ఈ ‘బజార్ రౌడీ’ ప్రేక్షకులను మెప్పించాడో లేదో చూద్దాం. చంద్రశేఖర్ (నాగినీడు) చాలా…
నటీనటులు : సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, శివ పండిట్సాంకేతిక నిపుణులు: సంగీతం : జాన్ స్టేవార్ట్ ఎదూరి, సినిమాటోగ్రఫీ : కమల్‌జీత్ నేగి, ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్, దర్శకత్వం: విష్ణువర్ధన్నిర్మాతలు : కరన్ జోహర్, హిరూ యష్ జోహర్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్‌వాలా, అజయ్ షా,హిమాన్షు గాంధీనిడివి: 2.15 నిమిషాలువిడుదల: ఆగస్ట్ 12, 2021అమెజాన్ ప్రైమ్ లో గత కొంత కాలంగా బయోపిక్ లకు చక్కటి ఆదరణ లభిస్తూ వస్తోంది. ఆ కోవలో వచ్చిన…