మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ‘ది ప్రిస్ట్’ తెలుగు డబ్బింగ్ మూవీ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ఆయన నటించిన ‘వన్’ చిత్రం సైతం శుక్రవారం నుండి తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే… ఈ రెండు మలయాళ సినిమాలు ఇదే యేడాది మార్చిలో రెండు వారాల వ్యవథిలో థియేట్రికల్ రిలీజ్ అయ్యాయి. ‘ది ప్రిస్ట్’లో మానవాతీత శక్తులున్న చర్చి ఫాదర్ గా నటించిన మమ్ముట్టి, ‘వన్’లో ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ‘వన్’…
దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమాలు రెండు. 2006లో వచ్చిన ‘రంగ్ దే బసంతి’, 2013లో విడుదలైన ‘భాగ్ మిల్కా భాగ్’. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత ఫర్హాన్ అక్తర్ తోనే మరో స్పోర్ట్స్ డ్రామా ‘తూఫాన్’ ను తెరకెక్కించి, ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రాన్ని మరోసారి గుర్తు చేశారు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా. అయితే… ఆయన గత చిత్రాలతో పోల్చినప్పుడు ‘తూఫాన్’ ఆ స్థాయిలో లేదనే నిరాశ వీక్షకులకు కలుగుతుంది. కానీ ఇప్పటికీ…
పృధ్వీరాజ్ సుకుమారన్ ఇప్పుడు నటుడే కాదు దర్శకుడు కూడా. అతను నటించిన తాజా చిత్రం ‘కోల్డ్ కేస్’ తొలిసారి థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలైంది. సినిమాటోగ్రాఫర్ తను బాలక్ డైరెక్టర్ గా మొదటిసారి మెగాఫోన్ పట్టిన ఈ ఇన్వెస్టిగేటివ్ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. తిరువనంతపురం సమీపంలోని చెరువులో మనిషి పుర్రె ప్లాస్టిక్ కవర్ లో దొరుకుతుంది. మీడియా కారణంగా ఆ వార్త దావానలంలా వ్యాప్తిస్తుంది.…
భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. ఈ దేశంలోని పౌరులందరినీ ఒక్కటిగా కలిపి ఉంచాలని మహనీయులు కలలు కని రూపొందించిన రాజ్యాంగం మనది. కానీ ఏడు దశాబ్దాలు గడిచినా ఈ దేశంలో కులాల మధ్య చిచ్చు రావణకాష్టంలా రగులుతూనే ఉంది. దీనికి కారణం ఏమిటి? రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయని రాజకీయ నాయకులదా? కులోన్మాదాన్ని పెంచి పోషిస్తూ పబ్బం గడుపుకుంటున్న కుల సంఘాల నేతలదా? అటు అధికారపీఠంపై ఉన్న నేతలలోనూ, ఇటు కులోన్మాదులలోనూ…
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘ది ప్రీస్ట్’. గత యేడాది జులైలో విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కు కరోనా కారణంగా బ్రేక్ పడింది. దాంతో అన్ లాక్ తర్వాత షూటింగ్ ను పూర్తి చేసి, ఈ యేడాది మార్చి 11న థియేటర్లలో విడుదల చేశారు. ఏప్రిల్ 14 నుండి ఈ సినిమా అమెజాన్ లోనూ వీక్షకులకు అందుబాటులో ఉంది. మరి ఈ సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ మూవీ ‘ది…
ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలోని ప్రముఖులంతా మలయాళ చిత్రసీమపై కన్నేశారు. మెగాస్టార్ చిరంజీవి మొదలు యంగ్ హీరో తేజా సజ్జా వరకూ మలయాళ చిత్రాలు రీమేక్ చేయడమే దానికి కారణం. థాట్ ప్రొవోకింగ్ మలయాళ చిత్రాలను తెలుగు వాళ్ళు సైతం ఇప్పుడు ఇష్టపడుతున్నారని మన దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. లాక్ డౌన్ టైమ్ లో మలయాళ సినిమాలు అనేకం డబ్ అయ్యి ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. వాటికి లభించిన ఆదరణే ఈ నమ్మకానికి…
గత యేడాది ఇదే ఫిబ్రవరి నెల 21న విడుదలైన ‘భీష్మ’ మూవీ నితిన్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఆ తర్వాత కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో ఆ సినిమా సూపర్ హిట్ రేంజ్ కు వెళ్ళకుండానే ఆగిపోయింది. అయితే దాని కంటే ముందే నితిన్ పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే లాస్ట్ ఇయర్ నితిన్ నటించిన మూడు నాలుగు సినిమాలు విడుదలై ఉండేవి. కానీ కరోనా…