Mohan Raja: హైదరాబాద్ నోవాటెల్‌లో శనివారం రాత్రి గాడ్ ఫాదర్ మూవీ సక్సెట్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇండియన్ సినిమాకు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కీలకంగా మారారని.. మంచి…
Nuvve Nuvve: మన స్టార్ హీరోల బర్త్ డేను పురస్కరించుకుని వాళ్ళు నటించిన సినిమాల స్పెషల్ షోస్ వేయడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలను అలానే ప్రదర్శించారు. అయితే ఆ మధ్య బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం విడుదలై ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేశ్ దాన్ని రీ-రిలీజ్ చేశారు. ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
30 years Of Aapadbandhavudu: కళాతపస్వి కె.విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ముచ్చటగా మూడు చిత్రాలు వెలుగు చూశాయి. వారి కలయికలో రూపొందిన తొలి చిత్రం ‘శుభలేఖ’ 1982లో జనం ముందు నిలచింది. 1987లో రెండో చిత్రంగా ‘స్వయంకృషి’ ప్రేక్షకులను అలరించింది. 1992 అక్టోబర్ 9న మూడో సినిమాగా ‘ఆపద్బాంధవుడు’ విడుదలయింది. ఈ మూడు చిత్రాలు చిరంజీవిలోని నటుడికి ప్రేక్షకులు పట్టాభిషేకం చేసేలా చేశాయనే చెప్పాలి. ఈ మూడు చిత్రాల్లోనూ చిరంజీవి నటునిగా ఒక్కో మెట్టూ…
V.V.Vinayak Birthday: వినాయక్ అంటే విక్టరీ… విజయమంటే వినాయక్ అన్న రీతిలో సాగిన దర్శకుడు వి.వి.వినాయక్. తెలుగులో పలువురు టాప్ స్టార్స్ తో బంపర్ హిట్స్ చూసిన వినాయక్ ప్రస్తుతం హిందీ చిత్రసీమలో తొలి అడుగు వేస్తున్నారు. తన మిత్రుడు రాజమౌళి తెలుగులో రూపొందించిన బ్లాక్ బస్టర్ ‘ఛత్రపతి’ ఆధారంగా హిందీలో వినాయక్ తన తొలి సినిమాను తెరకెక్కిస్తున్నారు. తనను దర్శకునిగా పరిచయం చేసిన నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు హీరో సాయి శ్రీనివాస్ ను ఈ…
SP Sailaja Birthday Special: ఒక కొమ్మకు పూచిన పూలు దాదాపు ఒకేలా ఉన్నట్టే శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి సంతానంలో ఆయనలాగే ఇద్దరికి గానం ప్రాణమయింది. వారే ప్రఖ్యాత గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఆయన చెల్లెలు ఎస్.పి.శైలజ. తండ్రి సాంబమూర్తి హరికథ చెప్పడంలో మేటి అనిపించుకుంటే, ఆయన పిల్లలు చిత్రసీమలో తమ గాత్రంతో జైత్రయాత్ర చేశారు. బాలు చెల్లెలు అన్న గుర్తింపుతోనే సినిమా రంగంలో అడుగు పెట్టినా, తన గళ విన్యాసాలతో శైలజ సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు.…
Ram Gopal Varma: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడు ట్విట్టర్‌లో ఏదో ఓ ట్వీట్ చేస్తూ వర్మ అందరికీ షాక్ ఇస్తుంటాడు. వర్తమాన విషయాలపై స్పందించే వర్మ తాజాగా టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపైనా రియాక్ట్ అయ్యాడు. ఈ మేరకు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ తొలి ఆదిపురుష్ అయ్యారంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెడుతున్నందుకు స్వాగతం పలికాడు. అయితే…
God Father Twitter Review: ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ గాడ్ ఫాదర్. మలయాళంలో లూసీఫర్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి మోహనరాజా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరీజగన్నాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటివరకు…
Progress Report: ఈ ఏడాదిలో అత్యధిక చిత్రాలు విడుదలైన నెల ఏదైనా ఉందంటే అది సెప్టెంబరే. ఈ నెలలో డబ్బింగ్ తో కలిసి ఏకంగా 33 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. చిత్రం ఏమంటే… జూలై మాసం మాదిరి గానే ఈ నెలలో ఒక్క చిత్రమూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మొదటి శుక్రవారం వచ్చిన యంగ్ హీరోస్ మూవీస్ ‘రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో, బుజ్జీ ఇలా రా’ డిఫరెంట్ జానర్లకు చెందినవే…
OTT Updates: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ టాలీవుడ్లో మరో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ లాభాలను మూటగట్టుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 5న విడుదలైంది. తాజాగా ఓటీటీ అప్డేట్ను జీ5 ప్రకటించింది. దీపావళి కానుకగా ఈనెల 21న బింబిసార మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో థియేటర్లలో ఈ మూవీని…