Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సోమవారం నామినేషన్‌ల ప్రక్రియ మరోసారి హాట్ హాట్‌గా సాగింది. ఈ మేరకు తాజాగా స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఈ వారం తాము నామినేట్ చేయాలనుకునే సభ్యుల ఫోటోను మిషన్‌లో పెట్టి ముక్కలు ముక్కలుగా చేయాలని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అయితే శ్రీసత్య మాత్రం రాజ్‌ను నామినేట్ చేస్తుంది. అతడు గత మూడు వారాలుగా నామినేషన్‌ల నుంచి సేవ్ అవుతూనే…
ప్రస్తుతం తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెడుతున్న సినిమా. దళపతి విజయ్ నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా ప్రొడ్యూస్ చేశాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన వారిసు మూవీ సంక్రాంతి సీజన్ లో తెలుగు తమిళ ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉంది.
NTR 30: ఆర్.ఆర్.ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఈ మూవీ 30వ సినిమాగా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాకు ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం మేకోవర్ అయ్యాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నందమూరి కళ్యాణ్‌రామ్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్…
Tollywood: ప్రస్తుతం టాలీవుడ్‌లో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్‌షిప్ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణకు పలువురు సెలబ్రిటీలు నివాళులు అర్పించేందుకు వచ్చిన సందర్భంలోనూ పవిత్ర లోకేష్ గురించి నరేష్ వారికి పరిచయం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట త్వరలో హీరో, హీరోయిన్‌గా ఓ సినిమాలో నటించబోతున్నట్లు ఇప్పుడు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ మూవీలో నరేష్, పవిత్ర లోకేష్ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన…
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషశెట్టితో ఈరోజు నాగశౌర్య వివాహం జరగనుంది. ఈ రోజు ఉదయం 11.25 గంటలకు పెళ్లి ముహూర్తంగా వేదపండితులు నిర్ణయించారు. వీరి వివాహ వేడుకకు బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వేదిక కానుంది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు నాగశౌర్య వివాహానికి హాజరుకానున్నారు. అటు శనివారం హల్దీ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. అనంతరం కాక్ టైల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో…
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ మరో మూడు వారాల్లో ముగియనుంది. 11వ వారం వీకెండ్ ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో ముఖ్యంగా హోస్ట్ నాగార్జున, ఆదిరెడ్డి మధ్య వాదోపవాదనలు జరిగాయి. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా రేవంత్‌తో జరిగిన డిస్కషన్‌లో ఆదిరెడ్డిదే తప్పు అనే విధంగా వీడియో వేసి మరీ నాగార్జున చూపించారు. కానీ అసలు వాదన టీవీ ఎపిసోడ్‌లో ప్రసారం కాలేదని.. ఆడవాళ్లతో ఆడదామని.. అది కూడా గేమ్…
Tollywood: టాలీవుడ్‌లో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా వివాదం ముదురుతోంది. తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో దిల్ రాజు పెద్ద ఎత్తున థియేటర్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి లాంటి పెద్ద పండగలకు…
Dil Raju: టాలీవుడ్‌లో కాంతార మూవీ సంచలన విజయం నమోదు చేసింది. కన్నడ డబ్బింగ్ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడం చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా నోరెళ్లబెట్టారు. ఈ సినిమాను విడుదల చేసిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీగా లాభాలను చవిచూసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో డబ్బింగ్ సినిమా కూడా కాంతార తరహాలో హిట్ అవుతుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు గట్టి నమ్మకంతో కనిపిస్తున్నాడు. తమిళంలో ఈనెల 4న…
Vasanthi Krishnan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో వాసంతి కృష్ణన్ తన అందచందాలతో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్‌బాస్‌కు ముందు వాసంతి ఓ సీరియల్‌తో పాటు రెండు చిన్న సినిమాలలో నటించింది. సంపూర్ణేష్‌తో కలిసి ఓ మూవీలో నటించింది. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం గుర్తింపు రాలేదు. ఊహించని విధంగా బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. హౌస్‌లో వాసంతి కాంట్రవర్సీలకు దూరంగా ఉండేది. ఎక్కువగా కీర్తి, ఇనయా, మెరీనాలతో స్నేహంగా మెలిగేది. పెద్దగా…
Sudigali Sudheer: ప్రముఖ నటుడు సుడిగాలి సుధీర్ సంచలన ప్రకటన చేశాడు. తాను మళ్లీ జబర్దస్త్ ప్రోగ్రాంకు వస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా అతడు నటించిన ‘గాలోడు’ సినిమా ప్రమోషన్లను చిత్ర యూనిట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జబర్దస్త్, మల్లెమాల సంస్థను ఎందుకు వదలాల్సి వచ్చిందో సుడిగాలి సుధీర్ వివరించాడు. జబర్దస్త్ నుంచి బయటకు రావడం తనకు తానుగా తీసుకున్న నిర్ణయమే అని.. కొన్ని అవసరాలు ఉండటం వల్ల ఆరు నెలలు గ్యాప్ కావాలని మల్లెమాల వాళ్లకు చెబితే…