Tollywood: ప్రస్తుతం టాలీవుడ్‌లో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్‌షిప్ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణకు పలువురు సెలబ్రిటీలు నివాళులు అర్పించేందుకు వచ్చిన సందర్భంలోనూ పవిత్ర లోకేష్ గురించి నరేష్ వారికి పరిచయం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట త్వరలో హీరో, హీరోయిన్‌గా ఓ సినిమాలో నటించబోతున్నట్లు ఇప్పుడు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ మూవీలో నరేష్, పవిత్ర లోకేష్ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో వీళ్లిద్దరూ ఎదుర్కొన్న సవాళ్లతో ఇప్పటికే కథని సిద్ధం చేసినట్లు సమాచారం.
Read Also: Naga Shaurya: నేడు బెంగళూరు వేదికగా టాలీవుడ్ యంగ్ హీరో వివాహం
ఇప్పటికే నరేష్, పవిత్ర లోకేష్ భార్యాభర్తలుగా చాలా సినిమాల్లో కనిపించినా తొలిసారి హీరో, హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ మూవీకి ప్రాధాన్యత ఏర్పడింది. అసలు తమ జీవితంలో ఏం జరిగింది? తాము ఎందుకు సహజీవనం చేయాల్సి వచ్చిందన్న అంశాలపై అందరికీ క్లారిటీ ఇవ్వడానికే ఈ మూవీని తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథలో కొంచెం ఫిక్షన్ కూడా జోడించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన, నటీనటులు, టెక్నికల్ క్రూ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. కాగా చివరిగా నరేష్, పవిత్ర లోకేష్ కలిసి ‘అందరూ బాగుండాలి.. అందులో మేముండాలి’ సినిమాలో నటించారు. ఈ మూవీ నేరుగా ఆహా ఓటీటీ వేదికగా విడుదలైంది.