NTR 30: ఎన్టీఆర్ సినిమాకు మ్యూజిక్ ప్రారంభం.. అనిరుధ్ మాస్ బీట్స్ షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR 30: ఆర్.ఆర్.ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఈ మూవీ 30వ సినిమాగా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాకు ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం మేకోవర్ అయ్యాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నందమూరి కళ్యాణ్‌రామ్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా అనిరుధ్‌తో దర్శకుడు కొరటాల శివ సమావేశమై చర్చలు జరుపుతున్నాడు. ఈ మూవీకి అనిరుధ్ మాస్ బీట్స్‌కు ఎన్టీఆర్ తన స్టెప్పులతో దుమ్మురేపడం ఖాయమని నందమూరి అభిమానులు విశ్వసిస్తున్నారు.
Read Also: PSLV-54: శనివారం నింగిలోకి పీఎస్ఎల్వీ-54.. ఓషన్‌శాట్-3 శాటిలైట్ ప్రయోగం
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
అనిరుధ్ గతంలో తెలుగులో రెండు, మూడు సినిమాలకు మాత్రమే సంగీతం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలకు మ్యూజిక్ సమకూర్చాడు. తాజాగా ఎన్టీఆర్ సినిమా అతడికి మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ మూవీతో అనిరుధ్ టాలీవుడ్‌పై తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు. త్వరలో ఎన్టీఆర్ 30 మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇటీవల హైడ్రామా నడిచింది. ఒక దశలో ఆగిపోయినట్లు పుకార్లు వినిపించాయి. ఆచార్య సినిమా ఫ్లాప్‌తో ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపలేదంటూ టాక్ వినిపించింది. అయితే కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్‌లో పాల్గొంటున్న ఫోటోలు బయటకు రావడంతో ఈ మూవీపై క్లారిటీ వచ్చింది.
#NTR30
This is going to be special @tarak9999 #KoratalaSiva@NANDAMURIKALYAN @NTRArtsOfficial @YuvasudhaArts pic.twitter.com/WlwpWlOrS0— Anirudh Ravichander (@anirudhofficial) November 20, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!