Dil Raju: ‘కాంతార’ తరహాలో ‘లవ్ టుడే’ థియేటర్లను షేక్ చేయడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju: టాలీవుడ్‌లో కాంతార మూవీ సంచలన విజయం నమోదు చేసింది. కన్నడ డబ్బింగ్ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడం చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా నోరెళ్లబెట్టారు. ఈ సినిమాను విడుదల చేసిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీగా లాభాలను చవిచూసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో డబ్బింగ్ సినిమా కూడా కాంతార తరహాలో హిట్ అవుతుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు గట్టి నమ్మకంతో కనిపిస్తున్నాడు. తమిళంలో ఈనెల 4న విడుదలై భారీ వసూళ్లు రాబడుతున్న లవ్ టుడే మూవీని అదే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి ఈనెల 25న దిల్ రాజు విడుదల చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో లవ్ టుడే సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. తమిళనాడులో లవ్‌టుడే చిన్న సినిమాగా విడుదలై రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని.. ప్రేమ ఈరోజుల్లో ఎలా ఉంటుందో ఈ మూవీలో బాగా చూపించారని ప్రశంసించాడు. ఇటీవల దేశవ్యాప్తంగా కాంతార గురించి అందరూ మాట్లాడుకున్నారని.. అలాగే లవ్ టుడే గురించి కూడా అందరూ మాట్లాడుకుంటారని.. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నాడు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
Read Also: Pawan kalyan: రామోజీ ఫిల్మ్ సిటీలో ఫైట్స్ చేస్తున్న పవన్ కల్యాణ్.. బహుశా అందుకేనేమో
నిజానికి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించినా.. తెరపై హీరో చేసి మేజిక్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు వివరించాడు. టాలీవుడ్‌లో ఈ మూవీ థియేటర్లను షేక్ చేయడం ఖాయమని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశాడు. కాగా ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా నటించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సత్యరాజ్, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం కూడా లవ్ టుడే మూవీ విజయానికి ప్రధాన కారణమైంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!