Varisu: ‘వారిసు'(Varisu) ప్రస్తుతం తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెడుతున్న సినిమా. దళపతి విజయ్ నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా ప్రొడ్యూస్ చేశాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన వారిసు మూవీ సంక్రాంతి సీజన్ లో తెలుగు తమిళ ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉంది. అయితే పెద్ద పండగలు ఉన్న సమయంలో తెలుగు సినిమాలకి మాత్రమే ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరి ప్రసన్న కూడా మాట్లాడడంతో మొదలైన వారిసు గొడవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మా తమిళ స్టార్ హీరో సినిమాని ఆపేస్తే, మీ సినిమాలని అడ్డుకుంటాం అంటూ కోలీవుడ్ డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెప్తున్నారు.
Read also: Cleaned With Cow Urine: ఎందుకీ వివక్ష?.. దళిత మహిళ నీళ్లు తాగిందని గోమూత్రంతో క్లీనింగ్
ఈ వివాదం రోజురోజుకీ ముదురుతూ ఉండడంతో వారిసు విడుదలని దిల్ రాజు వాయిదా వేస్తాడేమో అనుకున్నారు కానీ దిల్ రాజు వారిసు విడుదల వివాదాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్న దిల్ రాజు, వారిసు బిజినెస్ ని పెంచే పనిలో పడ్డాడు. తెలుగులో వారిసు సినిమాని స్వయంగా రిలీజ్ చేస్తున్న దిల్ రాజు, తమిళ్ లో మాత్రం ఈ సినిమా రైట్స్ ని పెద్ద బ్యానర్ కి ఇచ్చాడు. వారిసు తమిళ థియేట్రికల్ రైట్స్ ని ‘సెవెన్ స్క్రీన్ స్టూడియోస్’ సొంతం చేసుకున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది(Seven Screen Studios Bagged Varisu Theatrical Rights). దిల్ రాజుకి టాలీవుడ్ డిస్ట్రిబ్యుషన్ లో మంచి గ్రిప్ ఉంది కానీ తమిళనాట అంతగా లేదు. ఈ కారణంగా దిల్ రాజు, వారిసు మూవీ విడుదలకి సెవెన్ స్క్రీన్ మూవీస్ తో చేయి కలిపాడు. గతంలో విజయ్ నటించిన మాస్టర్ మూవీని కూడా సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వాళ్లే డిస్ట్రిబ్యుట్ చేశారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ రాకతో వారిసు కలెక్షన్స్ లో మంచి జంప్ కనిపించే ఛాన్స్ ఉంది. ప్రమోషన్స్ అండ్ బిజినెస్ పనులని సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లిపోతున్న దిల్ రాజు తాను ప్లాన్ చేసినట్లు గానే వారిసు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తాడా? లేక వాయిదా వేస్తాడా అనేది చూడాలి.
Sabitha Indra Reddy: కేటీఆర్ కృషితో 1500 కంపెనీలు హైదరాబాద్ కి వచ్చాయి