తాజాగా మాస్కోలో జరిగిన దాడికి సంబంధించి రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడికి కారణమైన ఎవరిని కూడా వదిలి పెట్టేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవని జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉగ్రదాడలో రక్తపాతం ఏరులైపారింది. అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నేడు మార్చి 24 న రష్యా దేశవ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. Also read: AP BJP: ఏపీ…
మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్ కచేరీలో జరిగిన దాడి తరువాత నేరుగా పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు సహా పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు. శాసనసభ్యుడు అలెగ్జాండర్ ఖిన్‌స్టెయిన్ శనివారం టెలిగ్రామ్‌లో ఈ విషయాన్ని నివేదించారు.
Moscow Attack: రష్యా రాజధాని మాస్కోలో ఓ మ్యూజిక్ ఈవెంట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 60 మందికి పైగా మరణించారు. ISIS-K ఉగ్ర సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ ధృవీకరించింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్(ISIS-K) ఆఫ్ఘనిస్తార్, ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్ దేశాల్లోని ఒక ప్రాంతాలకు పాత పదం. ఇది 2014లో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత పలు ఉగ్రవాద దాడులతో దీని పేరు మారుమోగింది.