ఏపీలో వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంతి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల పై సీఎం జగన్ అధికారులను వివరాలు కోరారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పై సీఎం ఆరా తీశారు. రాష్ట్రంలో కోవిడ్ 19 పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు అధికారులు. 18 సంవత్సరాల్లోపు వారికి కూడా రెండు డోసులు దాదాపుగా పూర్తయ్యాయి.…