చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్ లక్ష్యాలలో మూడింటిలో రెండింటిని సాధించామని ఇస్రో తెలిపింది.
తనను అల్లారుముద్దుగా పెంచిన కన్న తల్లికి ఓ కూతురు వెరైటీ గిఫ్ట్ ఇచ్చింది. అయితే.. చిన్నప్పుడూ చందమామ రావే..జాబిల్లి రావే.. అంటూ తనను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన అమ్మకి చందమామపైనే స్థలాన్ని కొని బహుమతిగా ఇచ్చింది.
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో నేడు ప్రపంచం మొత్తం భారతీయ శాస్త్రవేత్తలను కొనియాడుతోంది. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి వెళ్లి శాస్త్రవేత్తలను అభినందించి తదుపరి మిషన్‌ను ప్రోత్సహించారు.
చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఇస్రో కీర్తి ప్రపంచ వ్యాప్తమయింది. ఈ తరుణంలో ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా జాబిల్లిపై దాగి ఉన్న రహస్యాలు తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ జీవితకాలం కేవలం 14 రోజులే కావడం గమనార్హం.
Team India Former Opener Wasim Jaffer Tweet on Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం బుధవారం సక్సెస్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్.. కొన్ని నిమిషాల్లోనే భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్ అయింది. జాబిల్లి యాత్రల్లో ఇప్పటిదాకా ఏ దేశం అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించింది. జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా-25…
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగింది. బుధవారం అంటే ఆగస్టు 23 భారతదేశానికి, ప్రపంచానికి చారిత్రాత్మకమైన రోజు. ల్యాండ్ అయిన రెండు గంటల 26 నిమిషాల తర్వాత రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండర్ 'విక్రమ్' నుంచి బయటకు వచ్చింది.
జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా అడుగుపెట్టిన భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇస్రోకు అభినందనలు తెలిపాయి.
చంద్రుడి మీద విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత చంద్రయాన్-3 తొలి చిత్రాన్ని విడుదల చేసింది. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్ సెంటర్‌తో ల్యాండర్ కమ్యూనికేషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
చంద్రుడిని చేరుకోవడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ప్రధాని మోడీ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో చీఫ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.