భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో కాసేపట్లో కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించబోతోంది. ఈ మేరకు ఇస్రో కీలక ప్రకటన విడుదల చేసింది.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయింది. చంద్రయాన్-3 ప్రయోగం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. చంద్రమండలంపై పరిశోధన కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రోతో పాటు యావత్ భారత్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. జాబిల్లిపై అన్వేషణకు ‘చంద్రయాన్-3’ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
చంద్రయాన్-3 మిషన్‌ను జూలై 13న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించింది. జూలై 13న ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్.సోమనాథ్ ధృవీకరించారు. ఇది జూలై 19 వరకు కొనసాగవచ్చు.
NASA: భూమికి సహజ ఉపగ్రహం చంద్రుడిపై గత దశాబ్ధాలుగా పలు దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇందులో అన్నింటి కన్నా ముందు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ‘నాసా’ ఉంది. అయితే ఇప్పుడు నాసా చంద్రుడిపై మైనింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది.
ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల వ్యవధిలోనే కీలక ఘట్టం అవిష్కృతం కాబోతుంది. అది కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగం చేపట్టనుంది. రికార్డు స్థాయి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశ పెడుతూ ప్రపంచ దేశాలను ఇస్రో ఆకట్టుకుంటుంది. చంద్రుడి పై మరిన్ని పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. అత్యాధునిక టెక్నాలజీతో జులై రెండవ వారంలో LVM-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తుంది.
The Earth: భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని గంటలు పడుతుందంటే అంతా చటుక్కున 24 గంటలు అని చెప్తారు. ఈ 24 గంటలనే మనం ఒక రోజుగా పరిగణిస్తున్నాము. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని మిల్లిసెకన్ల మేర హెచ్చు తగ్గులు నమోదు అవుతుంటాయి. ఇది కూడా చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అయితే కొన్ని మిలియన్ ఏళ్లకు క్రితం భూమిపై ఒక రోజు అంటే 19 గంటలు మాత్రమేనట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు.