Chandrayaan-1: భూమి సహజ ఉపగ్రహం చంద్రుడిపై నీటి ఆనవాళ్లను తొలిసారిగా భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 గుర్తించింది. అయితే ఈ నీరు చంద్రుడిపైకి ఎలా చేరిందనేది ప్రశ్నగా మిగిలింది. అయితే చంద్రయాన్-1 డేటా ఆధారంగా పరిశోధనలు చేపట్టారు. ఇందులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రుడిపై నీటికి భూమి కారణమని తెలిసింది. హవాయ్ యూనివర్సిటీ పరిశోధకుల పరిశోధనల్లో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
Viral : చంద్రయాన్-3 చంద్రునిపైకి చేరినప్పటి నుండి భారత్ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చంద్రయాన్ గురించే చర్చించుకుంటుంది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవానికి చేరుకుంది.
Earthquakes on Moon: భూమి పొరల్లో కదలికల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. భూమి కంపించడం, భారీ భూకంపాలు రావడం మనం తరుచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. తాజాగా మొరాకోలో సంభవించిన భారీ భూకంపంలో రెండు వేలకు పైగా చనిపోయిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా అక్కడక్కడ ఇటీవల భూమి కంపిస్తోంది. అయితే భూమి తరువాత నివాసయోగ్యమైన ప్రదేశం లిస్ట్ లో శాస్త్రవేత్తల బ్రెయిన్ లో మొదట ఉన్నది చంద్రుడు మాత్రమే. అందుకే చంద్రుడిపై రకరకాల ప్రయోగాలు…
Aditya-L1: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్ దిగ్విజయంగా తన లక్ష్యం వైపు కదులుతోంది. సూర్యుడిపై పరిశోధనలకు చేయడానికి ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది. తాజాగా ఆదిత్య ఎల్1 ఆన్ బోర్డ్ కెమెరాల సాయంతో సెల్ఫీ తీసింది. దీంతో భూమి, చంద్రుడు కనిపించడం చూడొచ్చు. చంద్రుడు భూమికి కుడి వైపున చిన్న చుక్కలా ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది.
chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండిగై చరిత్ర సృష్టించింది. ఇప్పటికే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ పనిని ప్రారంభించాయి.
ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది. రోజూ వచ్చే చంద్రుడిలాగా కాకుండా జాబిల్లి ఇవాళ(ఆగస్టు 30) పెద్దగా, అత్యంత కాంతివంతంగా కనిపించింది. భూమికి అత్యంత సమీపానికి చంద్రుడు వచ్చినపుడు పౌర్ణమి రావడంతో ఆకాశంలో ఈ అద్భుతమైన సూపర్ బ్లూ మూన్ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది.
చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై సంచరిస్తున్న సంగతి తెలిసిందే. అయిన ఆ రోవర్‌కు ఊహించని అడ్డంకి ఎదురైంది. రోవర్‌కు భారీ బిలం అడ్డుగా వచ్చినట్లు ఇస్రో తెలిపింది.
Blue Supermoon: ఈ వారం ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. సాధారణం కన్నా పెద్దగా చంద్రుడు దర్శనమివ్వబోతున్నాడు. ఆగస్టు 31న పౌర్ణమి రోజున చంద్రుడు ‘బ్లూ సూపర్మూన్’గా దర్శనమివ్వబోతున్నాడు.