Chandrayaan 3: అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరో రెండు నెలల్లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సమాయత్తం అవుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను ల్యాండ్ చేయడానికి అత్యంత క్లిష్టమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఈ ప్రయోగం జరగబోతోంది. చంద్రుడి రిగోలిత్ థర్మో ఫిజికల్ లక్షణాలను పరీశీలిచేందుకు, చంద్రుడిపై భూకంపాలు, చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా వాతావరణ పరిశీలించేందుకు సైన్స్ పరికరాలను చంద్రయాన్ -3 మిషన్ ద్వారా జాబిల్లి పైకి పంపనున్నారు.
Artemis-2: దాదాపుగా 50 ఏళ్ల క్రితం మానవుడు చంద్రుడిపైకి వెళ్లాడు. ఆ తరువాత ఏ అంతరిక్ష సంస్థ కూడా చంద్రుడి పైకి వెళ్లేందుకు సాహసించలేదు. ఎందుకంటే అంతటి క్లిష్టతతో కూడిన అంతరిక్ష ప్రయాణం కాబట్టే నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యా అంతరిక్ష సంస్థలు చంద్రుడిని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే నాసా మాత్రం 2024లో ఆర్టెమిస్ -2 ద్వారా మానవుడిని మరోసారి చంద్రుడిపైకి పంపాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నలుగురు వ్యోమగాములను చంద్రుడి పైకి పంపనుంది.
NASA's Artemis 1, Over 400,000 Kms From Earth, Sets A New Record: నాసా చంద్రుడిపైకి పంపిన ఆర్టెమిస్ 1 వ్యోమనౌక విజయవంతంగా దాని యాత్రను కొనసాగిస్తోంది. పలుమార్లు వాయిదా పడిన ఈ అంతరిక్ష నౌక ప్రయోగం ఇటీవల జరిగింది. ఈ నౌక ద్వారా నాసా చరిత్ర సృష్టించింది. భూమి నుంచి 4,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆర్టెమిస్. గతంలో నాసాకు చెందిన అపోలో 13 మిషన్ 4,00,171 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇప్పుడు ఆర్టెమిస్1…
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-1 యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.నాసా ఓరియన్ అంతరిక్ష నౌకను శుక్రవారం చంద్ర కక్ష్యలో ఉంచినట్లు అధికారులు తెలిపారు, చాలా ఆలస్యం అయిన మూన్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు.
NASA Orion spacecraft makes closest flyby of Moon at 130 kms distance: నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిని ఆర్టిమిస్-1 రాకెట్ ప్రమోగం సక్సెస్ అయింది. రాకెట్ మోసుకెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ఓరియన్ చంద్రుడికి చేరువైంది. నవంబర్ 21న చంద్రుడికి అతి సమీపం నుంచి పరిభ్రమించింది ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. జాబిల్లి ఉపరితం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో నుంచి ప్రయాణించిందని నాసా వెల్లడించింది. వ్యోమరహిత నౌక అయిన ఆర్టెమిస్-1 మిషన్ లో భాగంగా…
030కి ముందు మానవులు చంద్రునిపై జీవించి పని చేసే అవకాశం ఉందని నాసా అధికారి ఒకరు తెలిపారు.ఆర్టెమిస్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత ఈ దశాబ్ధం ముగిసేలోపు మానవులు చంద్రునిపై నివసించవచ్చని నాసా అధికారి వెల్లడించారు.
చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపేందుకు నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం ఇవాళ జరగనుంది. నేడు మధ్యాహ్నం 2.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నట్లు నాసా ప్రకటించింది.
50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మళ్లీ మనుషులు కాలుమోపే నేడు తొలి అడుగు పడనుంది. ఆర్టెమిస్-1 మిషన్లో భాగంగా నేడు నాసా మూన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.చంద్రుడిపై మనిషి కాలుపెట్టి అర్ధశతాబ్దం దాటింది.