Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం.. ఇస్రో అధికారిక ప్రకటన.. డేట్ మారింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంపై అధికారికంగా ప్రకటన చేసింది ఇస్రో.. ఈ నెల 13వ తేదీన చంద్రయాన్ ప్రయోగం ఉంటుందంటూ ముందుగా వెల్లడించిన.. ఇప్పుడు మూన్ మిషన్ ప్రయోగం ఒక రోజు వెనక్కి నెట్టబడింది.. ఈ ప్రయోగం జూలై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు జరగనుంది.. దీంతో.. చంద్రున్ ప్రయోగం కోసం మరో రోజు వేచి ఉండాలి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 జులై 13న బయలుదేరుతుందని గత వారం ప్రకటించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ఈ రోజు ప్రయోగాన్ని ఒక రోజు వెనక్కి నెట్టినట్లు తెలిపింది.
Read Also: Hyderabad Traffic Police : మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ఈ ప్రయోగం ఇప్పుడు జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో జరగనుంది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ప్రయోగం తర్వాత రెండు నెలలపాటు ప్రయాణించనున్న స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌తో దాని జర్నీ ముగుస్తుంది. ఆ తర్వాత జాబిల్లపై పరిశోధనలు ప్రారంభమవుతాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గతంలోనూ చంద్రయాన్ మిషన్లు చేపట్టింది. మొత్తం ప్రయోగంలో సాఫ్ట్‌ల్యాండింగ్ చాలా క్లిష్టమైన ప్రక్రియ. చంద్రయాన్-2 సాఫ్ట్‌లాండింగ్‌లో విఫలం కావడంతో చంద్రుడిపై కూలిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 ప్రయోగం కోసం ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.. ఇప్పుడు కూడా సాఫ్ట్‌ల్యాండింగ్ ఏమంత సులభం కాదని కూడా నిపుణులు చెబుతున్నారు.
Read Also: Andhra Pradesh: వారిపై కేసులు ఎత్తివేయాలని మంత్రి, ఎంపీ విజ్ఞప్తి.. సీఎం సానుకూల స్పందన..
అయితే, ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయిన తర్వాత అది చంద్రుడి ఉపరితలం దిశగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో దాని వేగాన్ని జాగ్రత్తగా నియంత్రించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. దీని కోసం థ్రస్టర్ల (ఇంజిన్లు)ను మండిస్తారు. ఈ ఏడాది జపాన్ పంపిన హకుటో-ఆర్ ల్యాండర్ కూడా ఇలాంటి కఠిన పరిస్థితినే ఎదుర్కొని విఫలమైన విషయం విదితమే.. మొత్తంగా.. ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్ చేయడం ఎంత కీలకమో, అది దిగే ప్రదేశం కూడా అంతే ముఖ్యం. చంద్రయాన్-3లో రెండు ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్, అవాయిడెన్స్ కెమెరాలు ఉపయోగించారు. అవి పంపే ఫొటోలను బట్టి దానిని ఎక్కడ ల్యాండ్ చేయాలన్న తుది నిర్ణయా ఇస్రో శాస్త్రవేత్తలు తీసుకోనున్నారు..
Announcing the launch of Chandrayaan-3:
🚀LVM3-M4/Chandrayaan-3 🛰️Mission:
The launch is now scheduled for
📆July 14, 2023, at 2:35 pm IST
from SDSC, SriharikotaStay tuned for the updates!
— ISRO (@isro) July 6, 2023
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!