Montha Cyclone: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ప్రభావం రెండో రోజు సైతం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అనేక రైళ్లు రద్దు చేశారు.మొత్తం 122 రైళ్లు పూర్తిగా రద్దు చేయగా.. 14 రైళ్లు దారి మళ్లించారు. 28 రైళ్లు రీ-షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాక్‌పై భారీగా చేరిన వరద నీటిని తొలగించేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు నిలిపివేశారు. అయితే ట్రాక్ ఎక్కడా నష్టం జరగలేదని, రైలు రవాణా భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
READ MORE: Modi-Trump: ‘‘అందమైన వ్యక్తి.. చాలా కఠినుడు’’ దక్షిణ కొరియా టూర్‌లో మోడీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు.. మెంథా తుఫాన్ ప్రభావంతో వరంగల్ లో భారీ వర్షం కురుస్తోంది.. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ రైల్వేస్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లాల్సిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. చర్లపల్లి నుంచి హౌరా వెళ్లాల్సిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ను ఇక్కేడే నిలిపేశారు రైల్వే అధికారులు.. భారీ వర్షం నేపథ్యంలో రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది..
READ MORE: Pakistan: ఒక్క టమాటా రూ.75..! కొనేందుకు లోన్ ఇవ్వాలని పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఎంపీ డిమాండ్..!