Nara Lokesh: మొంథా తుఫానుపై ఆర్టీజీఎస్ కేంద్రంలో రెండో రోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.. వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు.. మొంథా తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను ఆరా తీశారు మంత్రి నారా లోకేష్.. ప్రధానంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని అధికారులు వివరించారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: మొంథా తుఫాను వేళ పవన్ కళ్యాణ్ కీలక ట్వీట్.. బాధితులకు భరోసా..!