రుతుపవనాలరాకకు ముందే కర్నాటకలో భారీవర్షాలు పడుతున్నాయి. బెంగళూరులో ఒక్కరోజులో 10 సెంటీమీటర్లకు పైగా వానపడడంతో ముంపులోనే అనేక ప్రాంతాలు వుండిపోయాయి. రెండవ రోజూ సీఎం సందర్శన కొనసాగుతోంది. బెంగళూరులో మంగళవారం ఈ శతాబ్దంలోనే కురిసిన భారీ వర్షంగా చరిత్రకెక్కింది. గత 113 ఏళ్లలో మే నెలలో ఒకేరోజు కురిసిన అత్యధిక వాన ఇదే. అంతేకాదు ఇది బెంగళూరు నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షం. 1909 మే 6వ తేదీన 15.39 సెంటీమీటర్ల కుండపోత అతలాకుతలం చేసింది.…
భారత దేశ రైతాంగానికి శుభవార్త.. ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. భారత్‌లోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.., అండమాన్‌ను తాకాయి నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో మరింత చురుకుగా కదులుతోన్న నైరుతి రుతుపవనాలు.. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరించినట్టు ఐఎండీ ప్రకటించింది.. దీంతో, 23 రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది ఐఎండీ. Read Also: Bandi Sanjay: నాగరాజు కుటుంబానికి పరామర్శ.. హత్య వెనుక పెద్ద కుట్ర..! ఇక, నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌తో…
ఎండలతో సతమతం అవుతున్న ప్రజానీకానికి ఐఎండీ చల్లని కబురు అందించింది. భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం చేశాయని ఐఎండీ తాజాగా వెల్లడించింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్లు వివరించింది. అంతేకాకుండా బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడుకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు…
వేసవికాలం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముందుగా అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని తెలిపిన వాతావరణ శాఖ.. ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. ఈ నెలఖరులోగా కేరళను తాకుతాయని చెప్పింది. జూన్ 8వ తేదీ లోగా తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది వాతావారణ శాఖ. మరోవైపు నిన్న…
కర్నాటకలోని తుంగభద్ర జలాశయం నిండుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి ఇన్ ఫ్లో పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 9,342 క్యూసెక్కులుగా వుంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1593 అడుగులుగా వుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100. 855 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 12.54 టీఎంసీలుగా వుంది. ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే గతేడాది కంటే ముందుగానే డ్యామ్…
యూరప్ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. వెంటనే వివిధ సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.. ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని.. దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, ఎండవేడి, వడగాలులు, వర్షాకాల సన్నద్ధత, కరెంట్ కోతలపై సమీక్ష నిర్వహించారు.. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, ఫలితంగా పెరిగిన విద్యుత్ డిమాండ్, బొగ్గు సరఫరాలో అంతరాలు, తదితర సంబంధిత అంశాలపై చర్చించారు. Read Also: Union minister Danve:…
అల్పపీడన ప్రభావం వల్ల తిరుమల తడిసి ముద్దయింది. కుండపోత వర్షంతో భక్తులు వణికిపోయారు. ఒకవైపు పౌర్ణమి కావడంతో కలియుగ వైకుంఠానికి భక్తులు పోటెత్తారు. దాదాపు మూడు గంటల పాటు ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదంగా మారిపోయింది. చలి గాలులు కూడా వీస్తుండడంతో భక్తులు బయటకు రావడానికి వెనుకాడారు. అనుకోని అతిథి రాకతో భక్తజనం ఉలిక్కిపడ్డారు. ఉరుములు, మెరుపులతో మధ్యాహ్నం వాన పడింది. తర్వాత 5 గంటల వరకు కుండపోతగా కురుస్తూనే వుంది.…
బిజీగా ఉండే పారిశ్రామికవేత్తల్లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు ఉన్నారు.. దీంట్లో ముందు వరుసలో ఉంటారు.. ఆనంద్ మహేంద్ర.. ఆయన సోషల్ మీడియా వేదికగా చాలా విషయాలపై స్పందిస్తుంటారు.. ఇక, అప్పుడప్పుడు ఇతర పారిశ్రామికవేత్తలు కూడా సందర్భాన్ని బట్టి తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.. తాజాగా రతన్ టాటాను ఓ ఫొటో ఆకట్టుకుంది.. పెట్స్ అంటే ఎంతో ఇష్టపడే టాటా.. ఆ ఫొటోలోని సన్నివేశాన్ని చూసి స్పందించకుండా ఉండలేకపోయారు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ ఫొటోను షేర్…
ఎవర్ని ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. నమ్ముకున్న వృత్తి వలన మొదట్లో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఎప్పుడోకప్పుడు అదే వృత్తి అతనికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వర్షాకాలం, పైగా సముద్రంలో అలజడి అధికంగా ఉండటంతో గత నెల రోజులుగా సముద్రంలో వేటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నెల రోజుల తరువాత తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో చంద్రకాంత్ అనే మత్స్యకారుడు ముంబై-పాల్ఘర్ సముద్రంలో వేటకు వెళ్లాడు. పదిమందిని తీసుకొని వేటకు…
ప్రతి ఏడాది వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి విలయాన్ని సృష్టిస్తుంటుంది. కొండచరియలు విరిగిపడటం అక్కడ కామన్. అయితే, ఈ వర్షాకాలంలో మరింత విలయాన్ని సృష్టించింది. ఈ విలయం దెబ్బకు 213 మంది మృతి చెందారు. రూ.600 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. భారీ వరదలకు 12 మంది కనిపించకుండా పోయినట్టు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొన్నది. ఇప్పటికీ ఇంకా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షాలకు…