యూరప్ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. వెంటనే వివిధ సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.. ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని.. దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, ఎండవేడి, వడగాలులు, వర్షాకాల సన్నద్ధత, కరెంట్ కోతలపై సమీక్ష నిర్వహించారు.. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, ఫలితంగా పెరిగిన విద్యుత్ డిమాండ్, బొగ్గు సరఫరాలో అంతరాలు, తదితర సంబంధిత అంశాలపై చర్చించారు.
Read Also: Union minister Danve: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాల్లో తీవ్రస్థాయిలో కులతత్వం..!
వేడిగాలులు, రుతుపవనాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధతతో పాటు.. విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరగడం, ఆ తర్వాత అత్యంత దారుణమైన విద్యుత్ కొరత నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు ప్రధాని మోడీ.. విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరగడం, ఆ తర్వాత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రధాన్యత ఏర్పడింది.. కాగా, వడగాల్పుల ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాలు ఆల్-టైమ్ హై ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి. గత వారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 42 నుండి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. ఢిల్లీలో గరిష్ట విద్యుత్ డిమాండ్ సోమవారం 6,194 మెగావాట్లకు పెరిగింది, ఇక, ఏప్రిల్‌లో తొలిసారిగా విద్యుత్ డిమాండ్ 6,000 మెగావాట్ల మార్కును దాటింది.
మరోవైపు, థర్మల్ ప్లాంట్లకు తగినంత బొగ్గు సరఫరా లేకపోవడంతో, దేశంలోని అనేక రాష్ట్రాలు… కొన్ని గంటలపాటు విద్యుత్తు అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్ మొదటి 27 రోజులలో విద్యుత్ సరఫరా డిమాండ్ కంటే 1.88 బిలియన్ యూనిట్లు లేదా 1.6 శాతం తగ్గింది. దేశంలో మొత్తం విద్యుత్ కొరత మార్చిలో ఉన్న మొత్తం కొరతను అధిగమించి 623 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం, దేశంలోని 3 కుటుంబాలలో 2 విద్యుత్తు అంతరాయాన్ని ఎదుర్కొంటున్నట్లు అంగీకరించాయి. ప్రతి 3 గృహాలలో 1 గృహాలు ప్రతిరోజూ 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇక, విద్యుత్ కేంద్రాలకు బొగ్గు తరలింపును సులభతరం చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ మే 24 వరకు దాదాపు 1,100 ట్రిప్పులను రద్దు చేసింది. బొగ్గు కొరతను తగ్గించడానికి, దాదాపు 500 ఎక్స్‌ప్రెస్ మెయిల్స్ మరియు 580 ప్యాసింజర్ రైళ్ల ట్రిప్పులు కూడా రద్దు చేసింది.