మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి… రేపు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్నాయి… మొదటి రోజు మృతిచెందిన సభ్యులకు సంతాపం ప్రకటించాక ఎల్లుండికి సభ వాయిదా వేయనున్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి… ఇక, రేపు జరగనున్న బీఏసీ సమావేశంలో.. సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.. ఇక, సమావేశాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. ఒకేసారి శాసన సభ…
భారతదేశంలోని న్యాయస్థానాల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. భారతదేశంలోని వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులు ఐదు కోట్ల మార్కుకు చేరుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వెల్లడించారు.
రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో మరో ముగ్గురు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. సభను, సభాపతి అధికారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సభా వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని డిప్యూటీ చైర్మన్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రం స్పందించింది. ప్రస్తుతానికి దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే విషయంపై ఎలాంటి ప్రతిపాదన లేదని కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాశ్ అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు.
రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక ధరలపై సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. డిప్యూటీ ఛైర్మన్ సభను సజావుగా సాగేలా సహకరించాలంటూ కోరారు. కానీ ఆందోళనను విరమించకపోవడంతో... నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యకలాపాలరు అంతరాయం కలిగిస్తున్నారంటూ విపక్షాలకు చెందిన 18 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అనుచిత ప్రవర్తనతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను మొత్తం వర్షాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేశారు.
ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు చేసిన నినాదాలు, గందరగోళం మధ్య ఉభయసభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. తక్షణమే చర్చకు ప్రతిపక్షాలు లేవనెత్తడంతో ఎగువ సభ ఎలాంటి కార్యకలాపాలు లేకుండా వాయిదా పడింది.
రాజ్యసభ ఎంపీగా ప్రముఖ మాజీ క్రీడాకారిణి పీటీ ఉష ప్రమాణస్వీకారం చేశారు. ఆమె హిందీలో భాషలో ప్రమాణం చేసింది. ఇటీవల ప్రఖ్యాత స్వరకర్త ఇళయరాజా, ఫిల్మ్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, ఆధ్యాత్మిక నాయకుడు వీరేంద్ర హెగ్గడేతో పాటు ఉష పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేయబడింది. ఉషను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభకు నామినేట్ చేసింది.
పార్లమెంట్ ఉభయ సభల్లో అంతరాయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆయనెప్పుడూ పార్లమెంట్‌లో గళం వినిపించింది లేదని... ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదని ఆమె మండిపడ్డారు.