తొలిరేజే ఎగువసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపుపై కాంగ్రెస్ ఎంపీల ఆందోళనల నడుమ, రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఈనేపథం్యంలో.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. అయితే.. అంతకుముందు, కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, రాజీవ్ శుక్లా, మీసా భారతి, ప్రఫుల్ పటేల్, హర్భజన్‌సింగ్, విజయేంద్రప్రసాద్ ప్రమాణస్వీకారం చేశారు.
read also: Minister Ambati Rambabu: పోలవరంపై చర్చకు సిద్ధం.. నీ బాస్‌ను పంపు దేవినేని..!
ఆ తర్వాత, ఎగువసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతుండగా వెల్‌లోకి కాంగ్రెస్ సభ్యులు దూసుకెళ్లారు. ఈనేపథ్యంలో.. కొందరు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని.. అలాగే రాష్ట్రపతి ఎన్నికలోనూ ఓటేసేందుకు వీలుగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు వెంకయ్య. నేడు (సోమవారం) సభ ప్రారంభమైన తర్వాత, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫాకు నివాళి అర్పించారు ఎంపీలు. అయితే..లోక్‌సభ కూడా ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. దీంతో.. స్పీకర్ ఓం బిర్లా ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యేలా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు .