లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లును బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకించింది. బీఆర్ఎస్ తరఫున చర్చలో ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై గురువారం లోక్‌సభలో చర్చిస్తున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఢిల్లీ కోసం చట్టాలు చేయడానికి కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయని ఆయన అన్నారు.
మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన మధ్య, ప్రతిపక్షాలు బుధవారం మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకురాబోతున్నాయి. లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మంగళవారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.
Supreme Court: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో చాలా ఆందోళన కలిగించే విధంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ తుఫానుగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.