కరోనా కాలంలో అనేక మంది తమ విలువైన ఉద్యోగాలను కోల్పోయారు. చాలామంది రోడ్డున పడ్డారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా విడిచిపెట్టలేదు. కొత్త కొత్త వేరియంట్లతో ఇబ్బందులు పెడుతూనే ఉన్నది. కరోనా కాలంలో ఎయిర్ లైన్స్ సంస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలు లేకపోవడంతో పైలెట్‌లను తొలగించింది. అలా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో యూకేకు చెందిన ఎరోల్ లెవెంథల్ కూడా ఒకరు. ఈయన ఉద్యోగం కోల్పోయిన తరువాత, పైలెట్ కాకముందు ఉన్న అనుభవంతో తిరిగి లారీ డ్రైవర్‌గా మారాడు. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించాడు. ఫ్రీలాన్స్ డ్రైవర్‌గా పనిచేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం సంవత్సరానికి 40 వేల పౌండ్ల కంటే అధికంగా సంపాదిస్తున్నాడట. పైలెట్‌గా ఉన్నప్పుడు నెలకు 30వేల పౌండ్ల వరకు సంపాదన ఉండేది. కానీ ఇప్పుడు లారీ డ్రైవర్‌గా అంతకంటే ఎక్కువగా సంపాదిస్తున్నట్టు ఎరోల్ పేర్కొన్నాడు. ధైర్యాన్ని కోల్పోకుండా నిర్ణయం తీసుకోవడంతోనే ఇది సాధ్యమైనట్టు ఆయన పేర్కొన్నారు.
Read: మొదలైన అరాచకం: తాలిబన్ల అదుపులో ఆఫ్ఘన్ మతగురువు…