పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఓ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించారు. 108 వాహనంలో డీజిల్ లేదని, తాము ఏం చేయలేమని చెప్పారు. ఇక చేసేది లేక బాధితురాలిని కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందించడంతో ఆ మహిళ ప్రాణాపాయం నుంచి బయట పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… మోమిన్‌పేట మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన సాలెమ్మ (33)…