రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగిన యువతి మర్డర్ కేసు సస్పెన్స్ రేపుతుంది. మూడు రోజులు గడుస్తున్నా సింగల్ క్లూ కూడా లభించలేదు. చనిపోయిన యువతి ఎవరో తేల్చే లేకపోతున్నారు పోలీసులు. కాగా.. చనిపోయిన యువతి ఎవరో తెలుస్తేనే హంతకుల్ని పట్టుకునే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. యువతి వయసు 20 సంవత్సరాల లోపు ఉంటుందని అంచనా వేస్తుండగా.. ఆ యువతి ప్యాంట్ వెనక భాగం జేబు ఉన్న ఓ స్టిక్కర్ లభ్యమైంది. కాగా.. మొబైల్ ఫోను పూర్తిగా…
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు నార్కోటెట్ సిబ్బంది కలిసి సుమారు వంద కిలోల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో వెల్లడించారు.
గత శనివారం రాత్రి మొయినాబాద్ సమీపంలో ముగ్గురు యువతులు ఒక స్కూటీ వస్తుండగా చెవేళ్ల నుంచి హైదరాబాద్‌కు అతివేగంగా వస్తున్న కారు యువతుల స్యూటీని ఢీ కొట్టింది. దీంతో స్యూటీపై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ప్రేమిక, సౌమ్య, అక్షరలు కిందిపడిపోయారు. అయితే ప్రేమిక తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య, అక్షరలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న అక్షర ఈ రోజు మృతి చెందింది. ఇప్పటికే ఈ…
వీకెండ్ వచ్చిందంటే చాలు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. మందేసి చిందేసి రోడ్లమీదకి వచ్చి మరీ అమాయక జనం ప్రాణాలు తీసేస్తున్నారు.మొయినబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ప్రాణం బలయింది. మొయినబాద్ నుండి చేవెళ్ల వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రేమిక (16) ఘటన స్థలంలోనే మృతిచెందింది. ప్రస్తుతం సౌమ్య,అక్షర గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని మరో 24 గంటలు గడిస్తే…
మొయినాబాద్ జేబీఐటీ కాలేజ్ లో బీటెక్ రెండవ ఏడాది చదువుతున్న విద్యార్థి విజయ్ భాస్కర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హాస్టల్ గది లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు విజయ్ భాస్కర్. విద్యార్ధి మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తోటి విద్యార్థులు. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తోంది జేబీఐటీ కాలేజ్ యాజమాన్యం. జేబీఐటీ కాలేజ్ లో బీటెక్ 2వ ఏడాది చదువుతున్నాడు విజయ్ భాస్కర్. హాస్టల్ గది…
ఈత సరదా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. మొయినాబాద్ లోని వెంకటాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకోసం వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో ఒకరి మృత దేహం లభ్యం అయింది. మరొకరి కోసం NDRF సిబ్బంది గాలిస్తున్నారు. ముగ్గురు స్నేహితులు మొయినాబాద్ మండలం సజ్జన్ పల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈతకోసం ముగ్గురు దిగగా ఇద్దరు మునిగిపోయారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమయింది. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం…