ఈత సరదా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. మొయినాబాద్ లోని వెంకటాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకోసం వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో ఒకరి మృత దేహం లభ్యం అయింది. మరొకరి కోసం NDRF సిబ్బంది గాలిస్తున్నారు. ముగ్గురు స్నేహితులు మొయినాబాద్ మండలం సజ్జన్ పల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈతకోసం ముగ్గురు దిగగా ఇద్దరు మునిగిపోయారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమయింది. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.