ఎమ్మెల్యే ఎర కేసులో సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఈ నెల 17న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఈరోజు సీజేఐ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను ప్రస్తావించారు.ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో మెరిట్‌లు ఉంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను తిప్పికొడతామని…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు వ్యవహరంలో నిందితుడిగా ఉన్న నందకుమార్ ను గత నెలలో భూవివాదం కేసులో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఇవాళ చంచల్ గూడ జైల్లో ఉన్న నందకుమార్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన కేసులో కేరళకు చెందిన తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో తుషార్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తుషార్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను ఆదేశించింది.