తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో తెలంగాణ సర్కార్ కు చుక్కెదురైంది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో నిందితుడైన రామచంద్ర భారతి బెయిల్ ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత నాంపల్లి సెషన్స్ కోర్టు ప్రభుత్వ పిటిషన్ ను కొట్టేసింది. రామచంద్ర భారతి బెయిల్ ను రద్దు చేయలేదు. బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవని న్యాయస్థానం వ్యాఖ్యనించింది.
Also Read : Unstoppable: ‘బుల్ బుల్ అన్ స్టాపబుల్’ సాంగ్ రిలీజ్ చేసిన గోపీచంద్!
గత సంవత్సరం రామచంద్ర భారతి జైలు నుంచి విడుదల కాగానే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అదే రోజు మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అర్జున్ రామచంద్ర భారతికి రిమాండ్ ను తిరస్కరించారు. రామచంద్ర భారతికి అదే రోజు బెయిల్ మంజూరు కూడా చేశారు. అనంతరం కొన్ని రోజుల వ్యవధిలోనే రామచంద్ర భారతికి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెషన్స్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ కేసును ఇవాళ విచారించిన నాంపల్లి సెషన్స్ కోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ.. రామచంద్ర భారతి బెయిల్ రద్దు చేయడం కుదరని పేర్కొంది.
Also Read : India’s First C-295 Aircraft: టాటా, ఎయిర్‌బస్ కలిసి రూపొందిస్తున్న తొలి సైనిక విమానం
ఇదిలా ఉంటే ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసులో ప్రతివాదుల్లో ఉన్న సీఎం కేసీఆర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసుల నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను పలుసార్లు కోర్టు విచారించినప్పటికీ అధికారికంగా నోటీసులు జారీ చేయలేదని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించడంతో దీనిపై శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. తెలంగాణ పోలీసులు కూడా దర్యాప్తును సాగించవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.