పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు.. మా వాళ్లపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మంచు మనోజ్.. నిన్న మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన ఘటనలపై చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. తన భార్య మౌనికతో కలిసి పీఎస్‌కు వచ్చిన మనోజ్.. తన అనుచరులు పళణి, వినాయకతో ఎంబీయూ సిబ్బంది హేమాద్రి నాయుడు, కిరణ్ పై ఫిర్యాదు చేయించారు..
తిరుపతి జిల్లా చంద్రగిరి మండ లంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదం తలెత్తి చిన్న కుమారుడు మనోజ్తో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. తన విద్యా సంస్థల్లోకి మనోజ్ ప్రవేశించకుండా అడ్డుకోవాలని మోహన్ బాబు కోర్టును ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు పొందారు. Also Read…
మంచు మనోజ్‌కు తాజాగా నోటీసులు జారీ చేశారు పోలీసులు.. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తారన్న సమచారంతో అప్రమత్తమైన పోలీసులు.. శాంతి భద్రతల దృష్ట్యా.. మోహన్‌బాబు యూనివర్సిటీలోకి అనుమతి లేదంటూ మనోజ్ నోటీసులు ఇచ్చారు..
మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. తన కుమారుడు మంచు మనోజ్.. ఎంబీయూకు వస్తారన్న సమాచారంతో పోలీసులను ఆశ్రయించారు మోహన్‌బాబు.. మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో.. పోలీసులకు ఆ కోర్టు ఉత్తర్తుల గురించి సమాచారం ఇచ్చారు మోహన్ బాబు..
మంచు మోహన్ బాబు ఇంటి ఆస్తుల గొడవ గురించి అందరికీ తెలిసిందే. గడచిన నెల రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా ఈ గొడవలొ మోహన్ బాబు ఓ రిపోర్టర్ ని మైక్ తో కొట్టడంతో మంచు వివాదం మరో మలుపు తిరిగింది. అయితే ఆ రిపోర్టర్ మోహన్ బాబు పై కేసు పెట్టడంతో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కొరగా కోర్టు అందుకు నిరాకరించింది.…
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. యూనివర్సిటీలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలతో సందడి నెలకొంది. విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికపై ఆయన మాట్లాడారు. గతం గతః అనే వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘గతం గతః. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను.…
Kannappa : హీరో విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ వారం ఒక అప్‌డేట్ ఇవ్వడానికి చేసిన ప్రకటనకు అనుగుణంగా, ప్రతీ సోమవారం కొత్త సమాచారం అందిస్తున్నారు. సినిమా నుంచి వివిధ పాత్రలను పోషించిన ప్రముఖ నటీనటుల పోస్టర్లను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు. ఈసారి, ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్లను మరింత సరికొత్తగా, యానిమేటెడ్ కామిక్ బుక్స్ రూపంలో చేసింది. డిసెంబర్ 23న, ‘కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్-1’ పేరుతో ఓ…
మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. పహడీషరీఫ్ పోలీసులకు మంచు విష్ణుపై మరోసారి మనోజ్ ఫిర్యాదు చేశాడు. మంచు విష్ణుతో పాటు మరో ఆరుగురిపై మనోజ్ ఫిర్యాదు చేశాడు. విష్ణు అనుచరులు వినయ్ మహేశ్వరి, విజయ్ రెడ్డి, కిరణ్, రాజ్ కొండూరు, శివ, వన్నూరులపై కూడా ఫిర్యాదు చేశాడు.
CP Sudheer Babu : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక సూచనలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని, ఉల్లంఘనలకు దిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఏడాది రాచకొండ పోలీస్ శాఖ 253 డ్రగ్స్ కేసులు నమోదు చేసిందని, 521 నిందితులను అరెస్ట్ చేయడం ద్వారా…
‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. తనపై నమోదైన కేసు దృష్ట్యా బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించిన మోహన్ బాబు.. ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. డిసెంబర్ 16న హైదరాబాద్ నుంచి చంద్రగిరికి మోహన్ బాబు చేరుకున్నారు. బుధవారం (డిసెంబర్ 18) సాయంత్రం శ్రీ విద్యానికేతన్ నుంచి ఆయన వెళ్లిపోయారు. కలెక్షన్ కింగ్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జల్పల్లిలో ఉన్న తన నివాసంలో జర్నలిస్ట్‌పై దాడి ఘటనకు…