డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఆ మధ్య విడుదలైన కన్నప్ప టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసాడు నిర్మాత విష్ణు.
ఇప్పటికే ఈ సినిమా నుండి మంచు విష్ణు, అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, శరత్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన లభించింది. ఇక తాజాగా కన్నప్ప లో కీలకమైన శివుడి పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లుక్ ను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ‘ ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడు.. భక్తికి మాత్రం దాసుడు’ అంటూ కీర్తిస్తూ నాట్యం ఆడుతున్న శివుడుగా అక్షయ్ కుమార్ ను పరిచయం చేసారు మేకర్స్. కన్నప్ప సినిమాను మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ స్థాయిలో సుమారు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. ఇక పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. త్వరలోనే రెబల్ స్టార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.