Manchu Manoj: పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు.. మా వాళ్లపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మంచు మనోజ్.. నిన్న మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన ఘటనలపై చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. తన భార్య మౌనికతో కలిసి పీఎస్‌కు వచ్చిన మనోజ్.. తన అనుచరులు పళణి, వినాయకతో ఎంబీయూ సిబ్బంది హేమాద్రి నాయుడు, కిరణ్ పై ఫిర్యాదు చేయించారు.. ఇక, ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్.. మా కుటుంబంలో జరుగుతున్న ఘటనలు బాధాకరం అన్నారు.. పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు.. తాత, అమ్మమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు వెళ్తే అడ్డుకున్నారు.. మా వాళ్లపై దాడి చేయడమే కాకుండా.. గేట్లు దూకి వెళ్లానని ఫిర్యాదు చేశారని ఆవేదన వెలిబుచ్చారు..
Read Also: Srikanth :హీరోయిన్ ఊహ రీఎంట్రీ.. శ్రీకాంత్ రియాక్షన్ ఇదే !
ఇక, నాకు దేవుడు ఇచ్చిన వరం అభిమానులు.. 8 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నా.. నాపై అభిమానులు ప్రేమ చూపిస్తున్నారు అన్నారు మనోజ్.. నాతో సమస్య ఉంటే నాతో మాట్లాడాలి.. నేను ఎక్కడికి పారిపోలేదన్న ఆయన.. నా వాళ్ల వాహనాల్లో చక్కెర పోయడం, కట్టిన బ్యానర్లు తొలగించడం ఏమిటి? అని మండిపడ్డారు.. డబ్బులిచ్చి, కిరాయిలకు మనుఘలను పెట్టికుని తిరిగే వాడిని కాదు.. పండుగ సమయంలో నా వాళ్లను పిలిపించి మనోజ్ తో ఉండకూడదని బెదిరించారని ఆరోపించారు.. క్యాంపస్ సమస్యలు గురించి చర్చించుకుంటే సరిపోతుంది.. నలుగురు పెద్ద మనుషులను పిలిచి అన్నదమ్ములతో మాట్లాడితే సరిపోయే చిన్న విషయం ఇదన్నారు.. మరోవైపు నారావారిపల్లెకు వెళ్లిన విషయంపై స్పందించిన మనోజన్.. సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లి మంత్రి నారా లోకేష్’ను కలవడం కేవలం పరామర్శించడానికే అని స్పష్టం చేశారు.