వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే.. ఈ పర్యటనలో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ టూర్‌లో పాల్గొంటాడా లేదా అనేది అనుమానాలు ఉండేవి. అయితే.. వాటికి షమీ ఫుల్ స్టాప్ పెట్టాడు. తన ఫిట్‌నెస్‌పై షమీ స్వయంగా అప్‌డేట్ ఇచ్చాడు. తాను నొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందానని, ఆస్ట్రేలియా టెస్టు పర్యటనకు దూరం కానని చెప్పాడు.
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ కు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దూరంగా ఉండనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో రోహిత్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో.. మహ్మద్ షమీ గురించి కీలక ప్రకటన చేశాడు.
Mohammed Shami: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. అయితే , టీమిండియా టెస్ట్ టీం, టి20 టీమిండియా జట్టు వేరురుగా ఉన్నాయి. ఇకపోతే ఈ నెలలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడవలసి ఉంది. అక్కడ సీనియర్ ఆటగాళ్లందరూ మళ్లీ టీంలోకి తిరిగి వస్తారు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ పైనే అందరి దృష్టి ఉంటుంది.…
Zaheer Khan Fab Four: ప్రస్తుత తరంలో అత్యుత్తమ టెస్టు క్రికెటర్లను ‘ఫ్యాబ్ 4’గా ఎంచుకుంటారన్నా విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్స్ ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ ట్యాగ్ కేవలం బ్యాటర్లకేనా?.. బౌలర్లకు వర్తించదా? అనే అనుమానం చాలామంది అభిమానుల్లో ఉంది. తాజాగా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేస్ విభాగంలో తన ఫ్యాబ్ 4ని ఎంచుకుని.. ఆ లోటును భర్తీ చేశాడు. దీంతో…
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు కోసం బీసీసీఐ సెలెక్టర్లు భారత జట్టును ఆదివారం ఎంపిక చేశారు. కారు ప్రమాదానికి గురైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండేళ్ల తర్వాత టెస్టుల్లో జట్టులోకి వచ్చాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారనుకున్నా.. సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయడం గమనార్హం. అయితే బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, సీనియర్ పేసర్ మహ్మద్ షమీలకు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు. ఇందుకు…
Mohammed Shami About ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు ఫైనల్‌కు చేరడంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టి.. మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరుడిగా నిలిచాడు. అయితే టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో షమీకి తుది జట్టులో అవకాశం దక్కలేదు. హార్దిక్ పాండ్యా గాయపడిన తర్వాత ఛాన్స్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. తానెంత…
Umesh Kumar Revelas Mohammed Shami’s Suicide Incident: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ జీవితంలో 2018లో పెను తుపానే వచ్చింది. భార్య హసీన్ జహాన్ పెట్టిన గృహహింస కేసు, ఫిక్సింగ్ ఆరోపణలు అతడి కెరీర్‌ను కుదిపేశాయి. కొద్ది రోజులకే ఫిక్సింగ్ ఆరోపణల నుంచి షమీ బయటపడ్డాడు. అయితే ఆ సమయంలో షమీ ఎంతో మనోవేదనకు గురయ్యాడట. దేశానికి ద్రోహం చేశాననే ఆరోపణలను సహించలేని అతడు ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని…
Mohammed Shami – Sania Mirza : భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిరోజుల క్రితం భర్తతో విడాకులు తీసుకుని ప్రస్తుతం తన కుమారుడితో కలిసి దుబాయిలో నివాసం ఉంటుంది. అయితే ఈమధ్య కొందరు ఉత్సాహకులు టీమిండియా ఆటగాడు మహమ్మద్ షమీతో వివాహం జరగబోతుందన్నట్లు పుకార్లు పట్టించారు. ఇకపోతే మహమ్మద్ షమ్మీ గడిచిన కొద్ది కాలం రోజుల నుంచి తన భార్యతో దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.…
Imran Mirza breaks silence on Sania Mirza Wedding: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు సానియా డివోర్స్ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే పాక్ నటి సనా జావేద్‌ను షోయబ్ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సానియా తన సొంతగడ్డ హైదరాబాద్‌కు మకాం మార్చారు. అయితే మాలిక్‌తో వివాహబంధానికి ముగింపు పలికిన సానియా.. మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు కొంతకాలంగా నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.…
కేఎల్ రాహుల్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసినందుకు సంజీవ్ గోయెంకాపై టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మండిపడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి తర్వాత ఆవేశానికి లోనైన జట్టు యజమాని సంజీవ్ గోయెంకా.. కెమెరా ముందే మాట్లాడటం సరైంది కాదనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. సోషల్ మీడియాలోనూ గోయెంకా తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు షమీ మద్దతుగా నిలిచాడు.