లీడ్స్ ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. మరోసారి భారత బౌలింగ్ బలహీనత బయటపడింది. తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్స్ తీసినా.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. మొహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు పరుగులు ఇవ్వడం భారత్ ఓటమికి కారణమైంది. టీమిండియా బౌలర్ల వైఫల్యంతో 370కి పైగా టార్గెట్‌ను ఛేదించింది. ఈ నేపథ్యంలో భారత్ బౌలింగ్ యూనిట్‌పై సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అసహనం వ్యక్తం…
Test Retirement: ప్రస్తుతం దేశంలో ఉన్న ఉద్రికత్తల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగంతి తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత జరగబోయే ఇంగ్లాండ్, భారత జట్లు తలపడే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత సెలక్షన్ కమిటీకి సవాళ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.…
భారత పేసర్ మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా హత్య బెదిరింపులు పంపిన దుండగులు.. రూ.కోటి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని షమీ సోదరుడు హసీబ్ సోమవారం ఓ జాతీయ మీడియాకు తెలిపాడు. ఆదివారం మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మెయిల్ వచ్చిందని, వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం అని వెల్లడించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజ్‌పుత్ సిందార్ అనే వ్యక్తి మెయిల్…
ఐపీఎల్ 2025 లో భాగంగా 18వ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 18వ సీజన్‌కి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే రెండో మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నాయి.
ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియా. దుబాయ్‌లో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ఆస్ట్రేలియా సాధించిన రెండు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌లను భారత్ అధిగమించింది. ఛాంపియన్ ట్రోఫీ విజయం తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది తన భార్యను హగ్ చేసుకున్న వీడియో అనుకుంటే పొరపాటే.. మరి ఇంతకంటే స్పేషల్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా? ఈ…
Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని ఉద్దేశించి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ గురువారం దారుణమైన విమర్శలు చేయడంపై క్రీడాభిమానులు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దేశం కోసం ఆడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మతాన్ని ఆపాదించడం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజన్ మాసంలో ‘రోజా’ను పాటించకుండా, మ్యాచ్ సమయంలో షమీ నీరు, ఇతర డ్రింక్స్ తాగడాని షాబుద్దీన్ అన్నారు. షమీని క్రిమినల్‌గా పోల్చుతూ విమర్శించారు.
Mohammed Shami: టీం ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై ముస్లిం అత్యున్నత సంస్థ నుంచి విమర్శలు వచ్చాయి. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ, షమీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. షమీ ఓ క్రిమినల్ అంటూ విమర్శలు చేశారు. క్రికెట్ మ్యాచ్ కారణంగా షమీ రంజాన్ మాసంలో ‘‘రోజా’’ పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ మ్యాచ్ సమయంలో షమీ నీరు తాగుతూ, ఇతర కూల్ డ్రింక్స్ తాగుతూ…
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా గెలుపుతో శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి గ్రూప్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మహ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ 228 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేజింగ్‌లో రోహిత్ శర్మ మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లో 41 పరుగులు చేసి టీమిండియాకు చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లో 228 పరుగులు చేసింది. భారత్ ముందు 229 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది.
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్లో అతను మూడో వికెట్ సాధించిన వెంటనే అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా ఒక కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌ను అధిగమించాడు.