బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలపడి గులాబ్ తుఫాన్గా మారింది. గులాబ్ తుఫాన్ ఈరోజు రాత్రికి ఒడిశాలో తీరం దాటబోతున్నది. తీరం దాటే సమయంలో భారీ ఎత్తున గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఇక ఒడిశాతో పాటుగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి తీరప్రాంతాల్లోని ప్రజలను తరలిస్తున్నారు.…
ప్రస్తుతం ప్రధాని మోడి అమెరికా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈరోజు అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, వచ్చేనెల 6,7 తేదీల్లో ఇటలీలో ప్రపంచ శాంతి సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆహ్వానం లభించింది. అయితే, ఆ సదస్సుకు హాజరయ్యేందుకు కేంద్రం ఆమెకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో మమతా బెనర్జీ మోడీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడి ఎక్కడికైనా…
ప్రధాని మోడీ ఈరోజు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈనెల 23 న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తోనూ, ఆ తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తోనూ ప్రధాని సమావేశం కానున్నారు. ఇతర దేశాలకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా వాక్సిన్ తీసుకొని ఉండాలి. అందులోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిన ఏడు రకాల వ్యాక్సిన్లలో ఏదో ఒకటి తీసుకొని ఉండాలి. ఇండియాలో సొంతంగా అభివృద్ధి చేసిన కోవాక్సీన్ ను ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటి వరకు గుర్తించలేదు. ఇండియాలో తయారైన ఈ వ్యాక్సిన్ ను ప్రధానితో పాటుగా అనేక…
ప్రధాని మోడీ ఈరోజు అమెరికా పర్యటనకు బయలుదేరబోతున్నారు. ప్రధాని మోడీతో పాటుగా అయన బృందంలో విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్.జయశంకర్, విదేశీ వ్యవహరాల కార్యదర్శి హెచ్.వి. శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 23 వ తేదీన అస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదె సుగ లతో విడివిడిగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. యాపిల్ సీఈవో టీమ్ కుక్ తో పాటుగా అనేక అమెరికా…
భారత ప్రధాని నరేంద్రమోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 24న జో బైడెన్, నరేంద్రమోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వైట్ హౌస్ ప్రకటించింది. ఐతే… ప్రధాని మోదీ ఈ వారంలో అమెరికా వెళ్లనున్నారు. జో బైడెన్ ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసాక.. మోదీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి. వీరు గతంలో వర్చువల్ ద్వారా జరిగిన… క్వాడ్ సమ్మిట్ , క్లైమేట్ చేంజ్ సమ్మిట్, జీ-7…
త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో హనేగల్, సిందగీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపి తప్పకుండా గెలిచి పట్టు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప తప్పుకున్నాక జరగబోతున్న ఉప ఎన్నికలు కావడంతో ఎలాగైనా సరే గెలిచి పట్టు నిరూపించుకోవాలి. ఇది ఆ పార్టీకి అగ్ని పరీక్ష లాంటివి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యడ్యూరప్ప, జగదీశ్ షెట్టర్, డీవీ సదానంద గౌడ, నళిన్ కుమార్ కటిల్ లతో నాలుగు బృందాలను…
ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. వచ్చేవారంలో ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లనున్నారు. క్వాడ్ దేశాల సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్తో సమావేశం కానున్నారు. అనంతరం మోడి సెప్టెంబర్ 25 వ తేదీన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. రెండు రోజులపాటు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నట్టు పీఎంవో కార్యాలయం తెలియజేసింది. ఈనెల 24 వ తేదీన క్వాడ్ దేశాల సదస్సు జరగనున్నది. ఇండియా, అమెరికా, జపాన్, అస్ట్రేలియా దేశాలు క్వాడ్…
ప్రధాని మోడి ఈరోజు ఉదయం పారాఒలింపిక్స్ లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులతో సమావేశం అయ్యారు. పతకాలు సాధించిన వారికి ట్రీట్ ఇచ్చారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. క్రీడకలకు అంగవైకల్యం అడ్డుకాదని, దీనికి ఉదాహరణ పతకాలు సాధించిన క్రీడాకారులే అని ప్రధాని మోడీ ఈ సందర్బంగా పేర్కొన్నారు. పతకాలు సాధించిన ప్రతి ఒక్కరిని ప్రధాని పలకరించారు. ప్రధానిని కలిసినందుకు క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. Read: తాలిబన్ల విజయం వారికి మరింత బలాన్నిస్తుందా…?
పలు సూపర్ హిట్ చిత్రాల రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవలి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో ఋషిలా కనిపిస్తున్నారాయన. అయితే ఈ లుక్ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అంశానికి కేంద్రబిందువు అయింది. మనదేశ ప్రధాని నరేంద్ర మోడి సైతం గత కొంత కాలంగా పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇదే ఇప్పుడు ఓ యువ రచయితలో కొత్త ఆలోచన పుట్టడానికి కారణమైంది. Read Also : ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్…
గుజరాత్లోని సోమ్నాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడి శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలకు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక, తీవ్రవాద శక్తుల ఆధిపత్యం కొంతకాలమే అని, ఆ శక్తులు ఉనికి శాశ్వతం కాదని అన్నారు. ఆ శక్తులు ప్రజలను ఎక్కువకాలం తొక్కిపెట్టలేవని ప్రధాని తెలిపారు. సోమ్నాథ్ ఆలయం నవభారతానికి చిహ్నమని, గడిచిన వందల సంవత్సారాల్లో ఈ దేవాలయాన్ని, విగ్రహాలను ధ్వంసం చేశారని,…