ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతూనే వున్నాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి కొడాలి నాని తరహాలో హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.
ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన వంశీ..చంద్రబాబు నిజమే. నేను విశ్వాసఘాతుకుడనే…అది నీ ఒక్కడికే మాత్రమే. కానీ నువ్వూ… ఇందిరాగాంధీ గారికి, మహానుభావుడు ఎన్ టి ఆర్ , హరికృష్ణ , మీ తోడల్లుడు దగ్గుబాటి, పెద్దలు మోడీ , అమిత్ షా గార్లకు నమ్మకద్రోహివి, వెన్నుపోటుదారుడివి , విశ్వాసఘాతకుడివి.
అంతేనా కాంగ్రెస్ , టీడీపీ , బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు టీఆర్ఎస్, జనసేన పార్టీలకు నమ్మకద్రోహివి. వెన్నుపోట్లకు, నమ్మకద్రోహాలకు , విశ్వాసఘాతుకాలకు నిఖార్సయిన పేటెంట్ దారుడివి నువ్వే. నువ్వే. నువ్వే. చంద్రబాబూ… నేను కేసీఆర్ గారికి పొర్లు దండాలు పెడుతున్నానన్నావు. నిజమే.
మరి నువ్వు ? కేసిఆర్ గారి ముందు మోకాలిదండేసి “మోర” ఎత్తి పని చేస్తూనే ఉన్నావుగా .. ఓటుకు నోటు కేసు తేలేవరకు అంతేగా …!అంటూ ఘాటైన పదాలతో కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ శిబిరంలో చేరిన వంశీ.. చాలా కాలం నుంచి బాబు అండ్ టీంని టార్గెట్ చేస్తూనే వున్నారు. తాజా పరిణమాల నేపథ్యంలో వంశీ కౌంటర్లకు టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.