ప్రధాని మోడి ఈరోజు ఉదయం పారాఒలింపిక్స్ లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులతో సమావేశం అయ్యారు. పతకాలు సాధించిన వారికి ట్రీట్ ఇచ్చారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. క్రీడకలకు అంగవైకల్యం అడ్డుకాదని, దీనికి ఉదాహరణ పతకాలు సాధించిన క్రీడాకారులే అని ప్రధాని మోడీ ఈ సందర్బంగా పేర్కొన్నారు. పతకాలు సాధించిన ప్రతి ఒక్కరిని ప్రధాని పలకరించారు. ప్రధానిని కలిసినందుకు క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. Read: తాలిబన్ల విజయం వారికి మరింత బలాన్నిస్తుందా…?
పలు సూపర్ హిట్ చిత్రాల రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవలి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో ఋషిలా కనిపిస్తున్నారాయన. అయితే ఈ లుక్ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అంశానికి కేంద్రబిందువు అయింది. మనదేశ ప్రధాని నరేంద్ర మోడి సైతం గత కొంత కాలంగా పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇదే ఇప్పుడు ఓ యువ రచయితలో కొత్త ఆలోచన పుట్టడానికి కారణమైంది. Read Also : ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్…
గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడి శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలకు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక, తీవ్రవాద శక్తుల ఆధిపత్యం కొంతకాలమే అని, ఆ శక్తులు ఉనికి శాశ్వతం కాదని అన్నారు. ఆ శక్తులు ప్రజలను ఎక్కువకాలం తొక్కిపెట్టలేవని ప్రధాని తెలిపారు. సోమ్‌నాథ్ ఆలయం నవభారతానికి చిహ్నమని, గడిచిన వందల సంవత్సారాల్లో ఈ దేవాలయాన్ని, విగ్రహాలను ధ్వంసం చేశారని,…
దేశ చరిత్రలో ఆగస్టు 14 వ తేదీని ఎప్పటికీ మర్చిపోలేరు. అఖండ భారతం ఇండియా-పాకిస్తాన్‌గా విడిపోయిన రోజు. భారత్, పాక్ విడిపోయిన సమయంలో ప్రజలు పడిన బాధలను ఎన్నటికీ మర్చిపోలేమని, ప్రజల కష్టాలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్ గా జరుపుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇండియా పాక్ విభజన సమయంలో రెండు దేశాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలు వారి ప్రాంతాలను నుంచి వేరు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో…
ఇండియాకు మరో అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో ప్రస్తుతం ఇండియా తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆగస్టు నెలకు భద్రతా మండలి అధ్యక్షస్థానంలో ఇండియా ఉండటం విశేషం. ఇండియా అధ్యక్షతన సముద్ర భద్రతపై ఈరోజు బహిరంగ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ఇండియా తరపున ప్రధాని మోడి అధ్యక్షత వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగబోతున్నది. భద్రతా మండలిలోని సభ్యదేశాలు, ఐక్యరాజ్య…
చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి వైరల్ అవుతుంటాయి. చూసేందుకు సాధారణ దృశ్యాల మాదిరిగా ఉన్నప్పటికీ, ప్రముఖులు వాటిని ట్వీట్ చేయడం వలన వైరల్ అవుతుంటాయి. గుజరాత్‌లోని భావనగర్ రోడ్డును జింకలు వరసగా దాటుతున్న వీడియోను గుజరాత్ ఇన్ఫర్మేషన్ ట్విట్టర్లో షేర్ చేసింది. వేలావదర్ జాతీయ జింకల పార్కు నుంచి సుమారు 3 వేలకు పైగా జింకలు ఒకేసారి రోడ్డుమీదకు వచ్చాయి. అలా వచ్చిన జింకలు వరసగా రోడ్డును దాటుతూ చూపరులను ఆకట్టుకున్నాయి. గుజరాత్ ఇన్ఫర్మేషన్ ట్వీట్ చేసిన…
ఇజ్రాయిల్‌కు చెందిన పెగసిస్ స్పైవేర్ పార్లమెంట్‌ను కుదిపేయబోతుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఈరోజు రాజ్యసభలో కోవిడ్ పై చర్చజరగాల్సి ఉన్నది. అయితే, రాజ్యసభలో జరగాల్సిన అన్ని చర్చలను పక్కన పెట్టి పెగసిస్ స్పైవేర్ పై చర్చను జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశంలోని ప్రముఖులకు చెందిన ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచారని ప్రపంచంలోని పలు మీడియా సంస్థలు కథనాలగా పేర్కొన్నాయి. ఇండియాకు చెందిన 300 మందిపై నిఘా ఉంచారని ఆయా మీడియాలు పేర్కొన్నాయి. Read:…
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. కృష్ణా, గోదావరి జలాలకు సంబందించిన అన్ని విషయాలు బోర్డులే చూసుకుంటాయని చెప్పి గెజిట్‌ను విడుదల చేసింది. ఈ గెజిట్ అక్టోబర్ 14 వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలియజేసింది. గెజిట్ నోటిఫికేషన్‌ను ఆంధ్రనేతలు ఆహ్వానిస్తుంటే, తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు జలాల విషయాన్ని బోర్డులకు అప్పగించడంపై మండిపడుతున్నారు. Read: రాజమౌళి చేతుల మీదుగా “ఛత్రపతి” హిందీ రీమేక్ లాంచ్…
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం తరువాత ముఖ్యమంత్రి మమత బెనర్జీ దూకుడు పెంచారు. రాబోయో ఎన్నికల్లో మోడీ సారథ్యంలోని బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం అవుతున్నాయి. ఇటీవలే శరద్‌పవార్ ఇంట్లో ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తరువాత బీజేపీకి చెక్ పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు మమత బెనర్జీ. ఈనెల 25 వ తేదీన ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. నాలుగురోజుల పాటు ఆమె ఢిల్లీలోనే ఉండి కీలక నేతలతో…