PM Modi – UAE President: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానం మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈరోజు (జనవరి 19) భారతదేశానికి అధికారిక పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ప్రధాన మంత్రి మోడీ యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు.…