PM Modi – UAE President: యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi – UAE President: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానం మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈరోజు (జనవరి 19) భారతదేశానికి అధికారిక పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ప్రధాన మంత్రి మోడీ యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. భారత్‌లో యూఏఈ అధ్యక్షుడి పర్యటన కేవలం రెండు గంటలకు పైగా మాత్రమే జరగనున్నట్లు సమాచారం.
READ ALSO: JioHotstar సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లలో భారీ మార్పులు.. కొత్త ప్లాన్ రేట్స్ ఇదిగో..!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..

యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షేక్ మొహమ్మద్ భారతదేశానికి అధికారికంగా రావడం ఇది మూడవసారి, మొత్తంగా ఆయనకు ఇది ఐదవ పర్యటన కానుంది. ఈ పర్యటన భారతదేశం- యూఏఈ సంబంధాలలో మరో మైలురాయిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై ఉమ్మడి ప్రయోజనాల కోసం ఈ ఇద్దరు నాయకులు కొత్త మార్గాన్ని రూపొందించనున్నారు. భారతదేశం – యూఏఈ మధ్య సంబంధం కేవలం వాణిజ్యానికే పరిమితం కాలేదు. ఇటీవలి సంవత్సరాలలోఈ రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సంబంధాలు పెరిగాయి. సెప్టెంబర్ 2024లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఏప్రిల్ 2025లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భారతదేశాన్ని సందర్శించడం ఈ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది. నేటి సందర్శన ఆ చొరవలో భాగం అని, ఇది రక్షణ, సాంకేతికత వంటి రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తు్న్నారు. ఈ పర్యటన ఇంధన భద్రత, ముఖ్యంగా దీర్ఘకాలిక చమురు సరఫరాలు, పునరుత్పాదక శక్తిలో కొత్త కోణాలను స్థాపించడంపై దృష్టి పెడుతుందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Nitin Nabin: జాతీయ స్థాయిలో బీజేపీకి కొత్త సారథి.. రేపే ప్రధాని సమక్షంలో పట్టాభిషేకం!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!