టీఆర్‌ఎస్ నేత బండ ప్రకాష్ రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామా లేఖను బండ ప్రకాశ్ సమర్పించారు. ఇటీవలే బండ ప్రకాశ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు. వరంగల్‌లో 1954 ఫిబ్రవరి 18న జన్మించారు బండప్రకాశ్. ఎంఏ, పీహెచ్‌డీ చేశారు ప్రకాష్. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నుండి 1996లో పి.హెచ్.డి పట్టా పొందారు. తెలంగాణలోని పలు సామాజిక, స్వచ్ఛంద సంఘాలకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా…