రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ దాడి చేయడం హేయమైన చర్య అని సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నేతలను టీడీపీ టార్గెట్ చేసిందన్నారు. పోలింగ్ రోజే బీసీ నేత అయిన వెంకటేశ్వర్లను టీడీపీ నేతలు దూషించడం బాధాకరం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి కొనసాగితే.. గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి…