మంచిర్యాలలో జరుగుతున్న కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష సభలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రే కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం సత్యాగ్రహ సభ అని ఆయన వ్యాఖ్యానించారు. దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారని, బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్న నాటకమే సింగరేణి ప్రైవేటీకరణ పోరాటమన్నారు. ఇన్ని రోజులు బీజేపీ సంకలో చేరారు సీఎం కేసీఆర్.. మూత పడ్డ పరిశ్రమలు ఓపెన్ చేయని కేసీఆర్ వేరే వాటి గురించి మాట్లాడటం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. పేపర్ లీక్ లో కల్వకుంట్ల కుటుంబం ఇన్వాల్వ్ అయిందని, లిక్కర్ స్కాం, లీకేజీ అన్నింటిలో వాళ్ళ పాత్ర ఉందన్నారు. అనంతరం.. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ విధ్వంసం చేస్తోందన్నారు.
Also Read : Komatireddy Venkat Reddy : మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది
తెలంగాణలో బీఆర్‌ఎస్ కూడా ప్రజాస్వామ్యయుతంగా సాగాల్సిన సంస్థలను దుర్వినియోగం చేస్తుందన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి స్వాగతిస్తున్నామని, కానీ 8 ఏండ్లలో దళితులకు చేసిన న్యాయం ఏముందని ఆయన వ్యాఖ్యానించారు. మాదిగ సామాజిక వర్గంకి కేబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వలేదని, కానీ ఇవాళ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు దోచి పెట్టడానికీ దళిత బంధు అని ఆయన ఆరోపించారు. 17 లక్షల దళిత కుటుంబాల్లో.. 1700 మందికి దళిత బంధు ఇచ్చింది ప్రభుత్వమని, సింగరేణి సమస్యలపై… మేమే కొట్లాడుతున్నామని, సింగరేణి లో ఒక్క గని కూడా ప్రయివేటు పరం కానివ్వమన్నారు.
Also Read : International Storytelling Festival: కథలు చెప్పడానికి భయమెందుకు బ్రో.. వచ్చేయండి.. ఇక్కడ చెప్పుకుందాం
అధికారం లోకి వచ్చే కాంగ్రెస్ పార్టీగా హామీ ఇస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు. అనంతరం ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ. ‘భట్టి మండుటెండల్లో నడుస్తున్నారు. 300 km యాత్ర ముగించారు.. అభినందనలు.. దేశ చరిత్రలో.. బ్లాక్ అధ్యక్దుడు నుండి ఏఐసీసీ అధ్యక్దుడు వరకు ఎదిగిన నేత ఖర్గే.. ఖర్గే కి ఉన్న అనుభవం ఇంకెవరికి లేదు. కాబోయే ప్రధాని రాహుల్. ఆయన్ని పార్లమెంట్ నుండి మొదలుకుని… ఇంటి నుండి కూడా గెంటి వేశారు.’ అని వ్యాఖ్యానించారు. దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. దేశానికి ఏదైనా చేసింది అంటే..కాంగ్రెస్ అని, దళితుడిని ఏఐసీసీ అధ్యక్దుడిని చేసిన ఘనత కాంగ్రెస్‌ది అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ లో కాంగ్రెస్ కి పూర్వవైభవం తెద్దామని ఆయన అన్నారు.