Revanth Reddy : సీఎండీపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ చార్జీలు పెంచేందుకు తెలంగాణ సర్కార్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తెలంగాణ కాంగ్రెస్ గురువారం విద్యుత్ సౌధ, పౌర సరఫరాల శాఖ కార్యాలయాలను ముట్టడించేందుకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ధర్నా చేసేందుకు అనుమతుల లభించడంతో తరువాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీధర్‌బాబు, జీవన్ రెడ్డి, మధు యాస్కీ, మల్లు రవి పాల్గొన్నారు. విద్యుత్ సౌధ ముందు రోడ్డుపై కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎండీతో మాట్లాడేందుకు విద్యుత్ సౌధలోకి 8 మందిని పోలీసులు అనుమతించారు. దీంతో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అధికారులకు కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి చేశారు.
అటు కేంద్రం ఇష్టారీతిన పెంచిన పెట్రోల్,డీజీల్, గ్యాస్ ధరలను తగ్గించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిస్కంల అప్పులను ప్రభుత్వం చెల్లించకపోవటం వల్లే ఇవాళ దివాళ తీశాయని ఆరోపించారు. వాస్తవాలను వారు ఒప్పుకునే పరిస్థితిలో లేరని, సీఎండీపై ప్రభుత్వ ఒత్తిడి ఉందన్నారు. సీఎండీతో మాట్లాడుతుంటే మఫ్టీలో ఉన్న పోలీసులు వీడియో తీస్తున్నారని, సీఎండీపై నిఘా ఉంచడంతో ఆయన చెప్పాలన్నది కూడా చెప్పలేకపోయారన్నారు. చివరికి ప్రభుత్వం పోలీసులతో బెదిరించి పాలన చేయాలనుకుంటోందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
Also Read
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
తాజావార్తలు
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
ట్రెండింగ్
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!