6 నెలలుగా నాకు సీటు రాకుండా కుట్రలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు మ్మెల్యే రక్షణ నిధి.. ఎంపీ కేశినేని నాని.. వైసీపీలోకి వచ్చే ముందే తిరువూరు సీటు కండీషన్ పెట్టారని.. అందుకే నన్ను తప్పించడానికి రకరకాల సర్వేలు చేయించి చివరికి సీటు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ సమయంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కదని నిర్ధారణకు వచ్చిన నేతలు వైసీపీని వీడేందుకు మొగ్గు చూపుతున్నారు. తిరువూరు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన రక్షణనిధికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పేసినట్లు సమాచారం.